NTV Telugu Site icon

Gold Hunt: మీరు మారరా? వ్యూస్ కోసం గోల్డ్ హంట్ పేరుతో రీల్.. చివరకు ఏమైందంటే?

Gold Hunt

Gold Hunt

సోషల్ మీడియా మోజులోపడి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పిచ్చిగా రీల్స్ చేస్తు తమ పైత్యాన్ని చాటుకుంటున్నారు. ఇన్ స్టాలో లైకుల కోసం, వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. గతంలో ఓ యూట్యూబర్ మనీ హంట్ పేరుతో రీల్స్ చేసి హల్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన పోలీసులు ఆ యూట్యూబర్ తిక్కకుదిర్చి అరెస్ట్ చేశారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఓ యూట్యూబర్ వ్యూస్ కోసం గోల్డ్ హంట్ పేరుతో ఓవరాక్షన్ చేశాడు. చివరకు ఏమైందంటే?

Also Read:SLBC Tunnel: 5 మృతదేహాల వెలికి తీత?.. మూడింటి కోసం ముమ్మర గాలింపు..

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ యూట్యూబర్ పై పోలీసులు కేసు నమోదు చేయడం సంచలంగా మారింది. మందపాటి ఆదిత్య అనే యువకుడు ఇంస్టాగ్రామ్ లో వ్యూస్ పెంచుకునేందుకు గోల్డ్ హంట్ పేరుతో హైడ్రామా నడిపాడు. అమలాపురంలోని బాలయోగి స్టేడియంలోకి ప్రవేశించిన ఆదిత్య గోతులు తీశాడు. ఆ గోతుల్లో గోల్డ్, సిల్వర్ వస్తువులు, ఫోన్ ఇయర్ బడ్స్ దాచి పెట్టానని.. ఎవరికి దొరికితే వారు స్వంతం చేసుకోవచ్చని ప్రకటించాడు. ఇది తెలిసిన అతని ఫాలోవర్స్ స్టేడియానికి పరుగులు తీశారు.

Also Read:KTR: త్వరలో ఉపఎన్నికలు వస్తాయి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

200 పైగా అతని ఫాలోవర్స్ అక్కడికి చేరుకుని స్టేడియంలో గోతులు తవ్వుతూ వెతకడం ప్రారంభించారు. దీంతో స్టేడియం అంతా గోతులయ్యాయి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పోలీసులకు ఫిర్యాదు చేశామని కోనసీమ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరేష్ కుమార్ తెలిపారు. స్టేడియం అంతా గోతులు తీయడంపై అధికారులు, క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.