Site icon NTV Telugu

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మిస్సింగ్?

ఏపీలో కొత్త జిల్లాల విభజన సందర్భంగా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. అందులో అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం కూడా ఉంది. పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు స్థానిక వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్.. హెచ్ఆర్ఎ పెంపు

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా… వీరిలో ఏ ఒక్కరూ స్పందించడం లేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి హిందూపురం కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని వారు డిమాండ్ చేశారు.

Exit mobile version