Site icon NTV Telugu

Vizag: ఆర్కే బీచ్‌ రోడ్డులో కారు బీభత్సం

Rk Beach

Rk Beach

విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్డులో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది… అతివేగంగా వెళ్తు బైక్ పై వెళ్తున్న యువకుడిని ఢీకొట్టారు.. గాయపడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలించగా.. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ప్రమాద సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నట్టుగా చెబుతున్నారు స్థానికులు.. అంతేకాదు.. కారులో మద్యం బాటిల్స్ కూడా లభించాయి.. దీంతో.. మద్యం సేవించి.. ఇష్టం వచ్చినట్టుగా కారు నడిపి.. ప్రమాదానికి కారణం అయినట్టుగా భావిస్తున్నారు..

Read Also: Gold Rate Today: మహిళలకు శుభవార్త.. మరింత తగ్గిన పసిడి ధర

అయితే, ఆ కారు తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ఉంది… కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణం చేస్తుండగా.. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎయిర్ బాగ్స్ ఓపెన్ అవ్వడంతో ప్రమాదం తప్పిందని చెబుతున్నారు.. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు.. కానీ, ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ద్విచక్ర వాహనదారుడి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.

Exit mobile version