Site icon NTV Telugu

గుడివాడ ఏమన్నా పాకిస్తానా..?: బుద్ధా వెంకన్న

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ప్రస్తుతం హాట్‌ హాట్‌గా ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలు టీడీపీ ఎమ్మెల్యే బుద్ధావెంకన్న వర్సెస్‌ మంత్రి కొడాలినానిగా మారాయి. ఒకరిపై ఒకరూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఒక్కసారిగా చిన్నపాటి మినీ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. మంగళవారం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నానిపై ఫైర్‌ అయ్యారు. మంత్రి కొడాలి నానిది దొంగతనాలు చేసే బతుకు.. కొడాలి నానికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని బుద్ధా అన్నారు. కొడాలి నాని పాన్‌ పరాగ్ డబ్బా కొనుక్కునే డబ్బులు కూడా లేవు. అలాంటి కొడాలి నానికి అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. పెద్ద కన్వెన్షన్ సెంటర్ కొడాలి నాని ఎలా కట్టగలిగారు..? మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేస్తే అఫిడవిట్ ఇవ్వలేదు. గుడివాడ ఏమన్నా పాకిస్తానా..? ఎవ్వరూ గుడివాడ వెళ్లకూడదా..? మొన్న టీడీపీ వాళ్లు వెళ్తే ఆపారు.. ఇప్పుడు బీజేపీని అడ్డుకుంటున్నారంటూ విమర్శించారు. పోలీసులు ప్రజల దగ్గర జీతాలు తీసుకుంటున్నారా..? కొడాలి నాని దగ్గర జీతాలు తీసుకుంటున్నారా..? ఓరేయ్ పిచ్చి కుక్క… చంద్రబాబు, లోకేష్ మీద విమర్శలు చేస్తే గట్టిగా మాట్లాడితే మేమూ మాట్లాడతాం అంటూ బుద్ధా విరుచుకుపడ్డారు.

Read Also: నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై సీఐడీ కేసు

కొడాలినాని బాబు ఎవరూ..? మంత్రి కొడాలి చేసే కామెంట్లను వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా అసహ్యించుకుంటారు. 1991లో నెలకు రూ.1.15లక్షల అద్దె కట్టి నేను కొబ్బరికాయల వ్యాపారం చేశా. ఆ సమయంలో కొడాలినాని ఆగి ఉన్న వాహనాల్లో ఆయిల్ దొంగతనం చేసేవాడని బుద్ధా అన్నారు. చంద్రబాబుకి, కొడాలినానికి ఒకేసారి కరోనా వస్తే…, ఉండవల్లిలోని తన నివాసంలోనే హోం ఐసొలేషన్లో ఉండి కోలుకున్నారు. కరోనా సోకగానే చికిత్స కోసం పక్కరాష్ట్రంలో ఆస్పత్రికి పారిపోయిన కొడాలి నాని చంద్రబాబు ఆరోగ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పాన్ మసాలాలు నమిలి నమిలి నోటి క్యాన్సర్ తెచ్చుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. మద పిచ్చి, డబ్బు పిచ్చి పదవి పిచ్చి పట్టిన కొడాలినాని జగన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారు. కొడాలి నాని భాష గురించి ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారు. అలాంటి కొడాలినానికి అతడి భాషలోనే సమాధానం చెబుతామంటూ బుద్ధా వెంకన్న అన్నారు.

Read Also: సీఎస్ సమీర్ శర్మపై స్టీరింగ్ కమిటీ ఫైర్

కొడాలినాని మనిషి కాదు, ఓ పిచ్చి కుక్క.. కుక్కను నియంత్రించాలంటే మేం గర్జించాలంటూ బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల్ని మోసగించాడనే కేసులున్న కొడాలి నానినే పెద్ద 420.. కొడాలినాని చంద్రబాబు పై విమర్శలు మానే వరకు నేను మానను అంటూ బుద్దా వెంకన్న అన్నారు. జగన్ సామాజిక వర్గం, వైసీపీ నేతలు కొడాలి నానిని ఎంతగా ద్వేషిస్తున్నారో జగన్ గ్రహించాలి. కొడాలి నాని పిచ్చి కుదర్చటానికే నేను ఇలా మాట్లాడుతున్నా… నన్ను పోలీసులు అరెస్టు చేసిన సమయంలోనే కొడాలినాని మళ్లీ మొరగటం ప్రారంభించారు.

Read Also: కేసీఆర్‌ తెలంగాణను అన్ని రకాలుగా మోసం చేశారు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

విజయవాడ 1టౌన్ లో మంత్రి కొడాలి నాని వాడిన భాషపై అభ్యంతరం తెలుపుతూ కేసు పెట్టినా ఇంతవరకు అక్‌నాలెడ్జ్‌మెంట్‌ ఇవ్వలేదు. నాపై కేసు పెట్టి విచారించినట్లే కొడాలినాని పై కేసు పెట్టి విచారించాలని బుద్దా అన్నారు. గుడివాడ వేరే పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకోవటానికి అదేమైనా పాకిస్థానా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కొడాలినానిని వెంటనే అరెస్టు చేయాలి.. కొడాలి నాని మాట్లాడటం మానేస్తే మేము మాట్లాడం.. జెంటిల్మెన్‌ ఒప్పందానికి మేం రెడీ అంటూ బుద్దా వెంకన్న సవాల్‌ విసిరారు. చంద్రబాబు గురించి కొడాలి మాట్లాడితే.. నేనూ అదే స్థాయిలో మాట్లాడతా. కొడాలి నానిని పార్టీ నుంచి పంపిస్తే మీ పార్టీకున్న దరిద్రం పోతుందని వైసీపీకి చురకలు అంటించారు. మంత్రి కొడాలి నాని వెంటనే డిస్మిస్‌ చేయాలని బుద్ధా వెంకన్న డిమాండ్‌ చేశారు.


Exit mobile version