Site icon NTV Telugu

ఏలూరులో మహిళ దారుణ హత్య .. వివాహేతర సంబంధమే కారణమా?

Untitled 6

Untitled 6

Crime news: భార్యభర్తల బంధం అని బంధాలకంటే గొప్పది అని మన పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఏ బంధమైనా కొంత కాలమే మనకు తోడుగా ఉంటుంది. కానీ చివరి వరకు ఒకరి ఒకరు తోడు ఉండేది భర్యాభర్తలే.. అయితే దాంపత్య జీవితంలో ఇమడలేక కొన్ని జంటలు విడిపోతున్నాయి. మరి కొందరు వివాహేతర సంబంధాలను ఏర్పరుచుకుని జీవితాలను నాశనం చేసుకోవడం కాదు ప్రాణాలను కూడా పోగుట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా ఏలూరులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. ఏలూరు జిల్లా లోని పోలవరం లోని బాపూజీ కాలనీలో సంకురు బుజ్జమ్మ (35)అనే మహిళ నివాసం ఉంటుంది. కాగా వివాహిత అయిన బుజ్జమ్మ కొన్ని కారణాల చేత గత 15 సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటూ.. ఒంటరిగా నివసిస్తుంది.

Read also:Japan Movie Review: జపాన్ మూవీ రివ్యూ

ఈ క్రమంలో షేక్ సుభాని అనే వ్యక్తి తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నది మహిళ. అయితే ఏం జరిగిందో ఏమోగానీ.. మహిళ పైన షేక్ సుభాని విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం నిందితుడు పోలీసు స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. అయితే హత్యకు గల కారణాలు తెలియలేదు.. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయని.. ఆ మనస్పర్థల కారణంగానే నిందితుడు హత్య చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ నిందితుడి అంగీకారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version