Site icon NTV Telugu

మండపం నుంచి పెళ్లికూతురు పరారీ.. ఆఖరి నిమిషంలో ఆగిన పెళ్లి..

ఆఖరి నిమిషంలో పెళ్లి ఆగిపోయిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది.. దీంతో పెళ్లి ఆగిపోయింది.. ఇక, హర్ట్‌ అయిన పెళ్లి కుమారుడు, ఆ కుటుంబం.. పరువు నష్టం కింద రెండు లక్షల రూపాయలు చెల్లించాలని పోలీసులను ఆశ్రయించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం హోస్పేటకు చెందిన రామానుజులుతో, తంబళ్లపల్లె కు చెందిన తిరుమల కుమారితో గత జూలై 7న నిశ్చితార్థం జరిగింది.. ఇవాళ ఉదయం మదనపల్లిలో పెళ్లి జరగాల్సి ఉంది.. అయితే, నిన్న రాత్రి కళ్యాణ మండపం నుంచి వధువు తిరుమల కుమారి పరారైంది.

సమీప బంధువులతో పాటు మరో యువకుడితో గత రాత్రి పెళ్లి కూతురు వెళ్లిపోయిందని, ఈ ఉదయం మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిగిందని వరుడి కుటుంబీకులు చెబుతున్నారు.. ఈ ఘటనపై మదనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు వరుడు, వారి కుటుంబీకులు… నమ్మించి తనను మోసం చేశారని, తమకు పరువు నష్టం అని వాపోతున్న వరుడు… అందుకు పరిహారంగా రెండు లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాడు. వరుడు రామానుజులు ఫిర్యాదు మేరకు ఘటనపై విచారణ జరుపుతున్నారు పోలీసులు.

Exit mobile version