MLC Anantha Babu: జైలు నుంచి అనంతబాబు విడుదల వాయిదా.. కారణం ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.. డీఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనంతబాబు. గతంలో విచారణకువచ్చిన సమయంలో ప్రతి వాదులకు నోటీసులు జారీ చేశారు. నిన్న జరిగిన విచారణలో బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది అత్యున్నత న్యాయస్థానం.. అయితే, బెయిల్ షరతులపై కింది కోర్టు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.. అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను రాజమండ్రిలోని ఎస్సీ ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్ట్ కొట్టి వేసిన విషయం విదితమే కాగా.. ఆ తర్వాత బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు అనంతబాబు.. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇవాళ అనంతబాబు విడుదల వాయిదా పడింది.. బెయిల్ నిబంధనలు జారీ చేయాల్సిన రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ప్రస్తుతం సెలవులో ఉన్నారు.. అయితే, కోర్టు విధించే షరతులు ఆధారంగా బుధవారం రోజు ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.. మొత్తంగా నిన్న సుప్రీంకోర్టులో అనంతబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. ఇవాళ కోర్టు నుంచి విడుదల అయ్యేందుకు మరోరోజు సమయం పట్టేలా కనిపిస్తోంది.
Read Also: Witness movie review: విట్ నెస్ రివ్యూ
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
కాగా, ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని బాధితుడి ఇంటికి తీసుకెళ్లి వదిలేసిన ఘటన కలకలం రేపింది.. మే 19వ తేదీన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఇంటి నుంచి తీసుకెళ్లిన అనంతబాబు.. రోజు ప్రమాదంలో చనిపోయాడంటూ అదే రోజు మృతదేహాన్ని తీసుకొచ్చి.. మృతుడి ఇంటి దగ్గరే వదిలేశాడు.. అయితే, సుబ్రహ్మణ్యం బంధువులు అక్కడే అనంతబాబును అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అందర్నీ బెదిరించి ఆయన అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన కలకలం రేపడంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఆ తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబను అరెస్ట్ చేశారు. తాను ఒక్కడినే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశానని అంగీకరించినట్లుగా పోలీసులు ప్రకటించారు. ఇక, అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉండగా.. ఇప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. ఎమ్మేల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఈ ఏడాది మే 23వ తేదీ అరెస్టు అయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 210 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!