ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 నెలలు గడిచిన సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? అంటూ బొత్స మండిపడ్డారు. దమ్ములు గురించి మాట్లాడటానికి ఇవి మల్ల యుద్ధాలు కాదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి..అసెంబ్లీ లో తేల్చుకుంటామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
15 నెలల్లో రెండు లక్షలు కోట్లు అప్పులు తెచ్చారని.. ఈ విషయం వాస్తవం కాకపోతే.. వెంటనే బయట పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టాన్ని చేతిలో తీసుకుని అక్రమంగా అరెస్ట్ లు చేస్తున్నారని ఆరోపించారు. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుందని.. మళ్లీ జగన్ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరు ఎప్పటికప్పుడు ఎండగడుతామని బొత్స అన్నారు.