NTV Telugu Site icon

Botsa Satyanarayana: ఏపీ నుంచి ఎవరూ చనిపోలేదు.. ఒడిశా రైలు ప్రమాదంపై మంత్రి బొత్స

Botsa On Train Accident

Botsa On Train Accident

Botsa Satyanarayana Pressmeet On Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా స్పందించారు. ఈ విషయంపై సీఎం జగన్ నేతృతంలో సమీక్ష సమావేశం జరిగిందన్నారు. ఈ ప్రమాదం ఎవరైనా గాయపడినా, చనిపోయినా.. వారిని తీసుకురావాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటికే మంత్రి అమర్నాథ్‌తో పాటు ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఒడిశాకు పంపించామన్నారు. కోరమండల్ ఎక్స్ప్రెస్‌లో మొత్తం 482 మంది తెలుగు వారు ప్రయాణించినట్లు తమకు సమాచారం అందిందని.. వారి వివరాలను సేకరిస్తున్నామని అన్నారు. అయితే.. 76 మంది వివరాలు ఇంకా ట్రేస్ అవ్వలేదని చెప్పారు. యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో 89 మంది తెలుగు వారు ప్రయాణిస్తున్నారని, ఆ 89 మందితోనూ అధికారులు మాట్లాడుతున్నారని తెలియజేశారు.

Kottu Satyanarayana: చంద్రబాబు 2014లో ప్రజలను మభ్యపెట్టి గెలిచాడు

తాము అన్ని కలెక్టరేట్లలోనూ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని మంత్రి బొత్స వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు.. ఇచ్చాపురం నుంచి బోర్డర్‌లో ఉన్న అన్ని హాస్పిటల్స్‌ను సిద్ధం చేశామన్నారు. రాష్ట్రం నుంచి మెడికల్ టీమ్స్, మొత్తంగా 65 అంబులెన్స్‌లను పంపించామని చెప్పారు. ఎయిర్‌పోర్టులో ఒక చాపర్‌ను కూడా సిద్ధంగా ఉంచామని, అవసరమైతే నావి సహకారం కూడా తీసుకుంటామని తెలిపారు. ఈ ఒడిశా రైలు ప్రమాదంలో.. ఇప్పటివరకు ఏపీ నుంచి ఎవరూ చనిపోయినట్లు సమాచారం లేదన్నారు. కొందరు గాయపడినట్లు మాత్రమే తమకు సమాచారం అందిందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి.. సీఎం జగన్ ప్రతీ గంటకు సమీక్షిస్తున్నారని, అధికారులకు ఆయా ఆదేశాలు జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన తెలుగు వారికి ఒడిశాలోనూ ట్రీట్మెంట్ అందించేందుకు గాను అన్ని చర్యలు చేపట్టామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.

Margani Bharath: ఒడిశా రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి

కాగా.. శుక్రవారం సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే! షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు పట్టాలు తప్పడంతో.. అవి ఎదురుగా ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. అనంతరం బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. పట్టాలు తప్పిన ఆ కోచ్‌లను ఢీకొనడంతో, దీని కోచ్‌లు కూడా పట్టాలు తప్పాయి. ఈ విషాదంలో గూడ్సు రైలు కూడా చిక్కుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 290 మందికి పైగా మృతి చెందగా, 1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని శనివారం ప్రధాని మోడీ పరిశీలించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.