NTV Telugu Site icon

Botsa Satyanarayana: టీడీపీని చూసి ఎందుకు భయపడతాం.. మంత్రి బొత్స కౌంటర్

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana Gives Strong Counter To TDP Leaders: మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోని చూసి వైసీపీ భయపడుతోందని టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము టీడీపీని చూసి ఎందుకు భయపడతాం? వాళ్లేమైనా పులులా, రాక్షసులా? అని ప్రశ్నించారు. టీడీపీ ఒక రాజకీయ పార్టీ అని, ఓ పార్టీగా మేనిఫెస్టోను విడుదల చేసిందని తెలిపారు. చంద్రబాబు గతంలో కూడా మేనిఫెస్టోని ప్రకటించారు కానీ, దాన్ని అమలు చేయకుండా మాయలు చేశారని ఆరోపించారు. అయినా.. టీడీపీ మేనిఫెస్టో గురించి ప్రత్యేకంగా చెప్పదేమీ లేదని దుయ్యబట్టారు.

Delhi Murder Case: సాక్షి హత్య కేసులో సాహిల్ పట్టించిన ఫోన్ కాల్.. నేరం ఒప్పుకున్న నిందితుడు..

వైసీపీ నాలుగేళ్ల పాలనని దిగ్విజయంగా పూర్తి చేసుకుందని.. భగవద్గీత లాంటి మేనిఫెస్టోను తాము తూ.చ. తప్పకుండా పాటించామని మంత్రి బొత్స తెలిపారు. చెప్పింది చేశామని తాము గర్వంగా చెప్పగలమన్నారు. చంద్రబాబు హయాంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనకుందని.. ఇప్పుడు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ముందున్నామని అన్నారు. విద్యా రంగంలో సమూల మార్పులు తెచ్చామని, విద్యార్థుల సంఖ్యను పెంచామని, జిల్లాకో మెడికల్ కాలేజీని పెట్టామని చెప్పారు. ఆరోగ్య శ్రీ సేవల సంఖ్యను సైతం పెంచామని.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ నాలుగేళ్లలో మంచి జరిగిందా? చెడు జరిగిందా? అనేది ప్రజలే చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. మా పరిపాలన బాగుంటే.. మమ్మల్ని గెలిపించండని సీఎం జగన్ ధైర్యంగా అడుగుతున్నారని పేర్కొన్నారు. గతంలో మాదిరి కాకుండా.. ఇప్పుడు ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ అనే విధానాన్ని ఆమోదించామన్నారు. పునాదుల నుంచే నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు చేపట్టామన్నారు.

avitra lokesh: పవిత్రా లోకేష్ మనసులో మరో ఇద్దరు హీరోలు.. నరేష్ ఏమైపోతాడు..

ప్రాథమిక స్థాయిలోనే కాకుండా.. హైస్కూల్ స్థాయిలో కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని మంత్రి బొత్స చెప్పారు. త్వరలో డిజిటల్ క్లాసుల నిర్వహణకూ చర్చలు చేపట్టామని తెలిపారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న కీ పర్సన్స్.. జిల్లాల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఏ కుటుంబమైనా.. ఏ రాష్ట్రమైనా అభివృద్ది చెందాలంటే విద్య చాలా అవసరమని సూచించారు. అందరూ గర్వించదగ్గ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉండాలనేదే సీఎం జగన్ ఆలోచన అని తెలియజేశారు. ఈ స్థాయిలో చేపట్టినన్ని విద్యా సంస్కరణలు.. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో చేపట్టలేదని ఉద్ఘాటించారు. బడ్జెట్‌లో 40 శాతం ఖర్చు విద్యకే కేటాయిస్తున్నామన్నారు. ప్రతి పైసా.. ప్రతి రూపాయి మంచికి ఉపయోగపడుతున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి బొత్స చెప్పుకొచ్చారు.