NTV Telugu Site icon

Botsa Satyanarayana: రాష్ట్రంలో ఉన్న సమస్యలను కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదు..

Botsa

Botsa

Botsa Satyanarayana: సభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. కానీ, ప్రభుత్వం మార్షల్స్ ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని ఆరోపించారు. సూపర్ సిక్స్ కు నిధులు కేటాయించకుండా కాలక్షేపం చేస్తోంది.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదు.. ఓటేశారు.. మేం గెలిచాం.. ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ఈ ప్రభుత్వం ఉంది.. 15 రోజుల సభలో ప్రభుత్వ తీరును మేం ఖండిస్తున్నాం.. రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేం ఆశిస్తున్నాం.. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం లేదు.. వర్గీకరణ కోసం షెడ్యూల్ కులాలు పోరాడుతున్నాయి.. వర్గీకరణ కోసం పోరాడిన వారిపై టీడీపీ కేసులు పెట్టింది.. ఆ కేసులను ఎత్తేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Read Also: Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా..

ఇక, అన్ని కులాల వారికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మాజీ మంత్రి బొత్స తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టుపై చర్చ లేకుండా ప్రకటన ఇచ్చారు.. అసలు వర్గీకరణ ఎలా చేశారు.. ఏ విధంగా చేశారో కనీస చర్చలేదు.. ప్రభుత్వం అన్ని వర్గాలను కాపాడుకోవాలి.. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని కులాలను గౌరవించారు.. పదవుల్లోనూ అందరికీ న్యాయం చేశారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం పెడితే ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టింది.. అట్టడుగు వర్గాల వారికి గౌరవం ఇవ్వడం ఈ ప్రభుత్వానికి నచ్చదని ఆయన ఆరోపించారు. అట్టడుగు వర్గాలపై ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ద్వేషం కలుగుతుంది.. ఈ ప్రభుత్వం తీరును మేం తప్పుపడుతున్నాం.. గౌరవంగా అన్ని వర్గాలు జీవించేలా ప్రభుత్వం చొరవతీసుకోవాలన్నారు. అందరికీ మంచి చేయాలనే మేం కోరుతున్నామని బొత్స సత్యనారాయణ అన్నారు.