Botsa Satyanarayana: శాసన మండలిలో వ్యవసాయ సంక్షోభంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.. గత ప్రభుత్వంలో రైతులను సకాలంలో ఆదుకున్నాం.. విపత్తు వస్తే సీజన్ ముగిసేలోపు పరిహారం అందించామన్నారు. విత్తనాలు, ఎరువులు రైతుల వద్దకే తీసుకెళ్లి అందించాం.. మా ప్రభుత్వంలో అనుసరించిన వ్యవసాయ విధానాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది.. మేం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేశాం.. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చెల్లించాల్సిన బకాయిలు 5286 కోట్ల రూపాయలు అని మాజీ మంత్రి బొత్స అన్నారు.
Read Also: Konda Surekha: జోగులాంబ ఆలయ పూజారిపై క్రిమినల్ కేసులు.. విచారణకు మంత్రి కొండా సురేఖ ఆదేశం
ఇక, వైసీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటే రైతుల పేరుతో డబ్బులు తీసుకున్నారనడం కరెక్ట్ కాదు అని ఎమ్మెల్సీ బొత్స. ఇలా మాట్లాడటం రైతులను అవమానపరచడమే.. అధికారుల దగ్గర ఆత్మహత్యలు చేసుకున్న రైతుల లెక్కలు ఉన్నాయి.. మీ హయంలో పెండింగ్ లో ఉన్న చెల్లింపులు కూడా మేం వచ్చాక చేశాం.. ఆ లెక్కలు కూడా మా దగ్గర ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు మేలు జరగాలి అని బొత్స సత్యనారాయణ తెలిపారు.