Site icon NTV Telugu

Botsa Satyanarayana: రైతుల పాదయాత్రపై ఫైర్.. ఎందుకు సహకరించాలి?

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana Comments On Amaravati Farmers Padayatra: అమరావతి రైతుల పాదయాత్ర మీద ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రైతుల ముసుగులో టీడీపీ, రియల్ ఎస్టేట్ దోపిడీదారులు కలిసి.. ఈ అమరావతి పాదయాత్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అసలేం ఉద్ధరించడానికి వాళ్లు పాదయాత్ర చేస్తున్నారు? వారికి మేం ఎందుకు సహకరించాలి? అని ప్రశ్నించారు. అమరావతి భూముల్లో టీడీపీ నాయకులు దోచుకున్నారని, వాళ్లు ఎంత దోచుకున్నారో కూడా శాసనసభ సాక్షిగా తాము వెల్లడించామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీతో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక ఇదే సమయంలో.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పార్టీగా మార్చుకోవడం వాళ్ల ఇష్టమన్నారు. ఏపీలో ఉన్న అనేక పార్టీల్లో బీఆర్ఎస్ కూడా ఒక పార్టీ అవుతుందే తప్ప, ఆ పార్టీ ప్రభావం తమపై ఏమాత్రం ఉండదని తేల్చి చెప్పారు. పోటీలో ఎంత ఎక్కువ మంది ఉంటే, అంతే మంచిదని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

కాగా.. విజయనగరం మయూరీ కూడలి నుంచి వైఎస్ఆర్ జంక్షన్ వరకు అభివృద్ధి చేసిన రోడ్డు, సెంటర్ లైటింగ్, వాటర్ ఫౌంటెన్లపై బుధవారం రాత్రి చర్చించారు. అనంతరం ఎంపీ బెల్లం చంద్రశేఖర్, మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్లతో కలిసి రూ. 2.50 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాల్ని నిర్వహించారు. అంతకుముందు.. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు బొత్స స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీకి వచ్చి టీచర్లతో మాట్లాడాలని సూచించిన ఆయన.. తెలంగాణలో ఇస్తున్న పీఆర్‌సీని, ఏపీలో ఇస్తున్న పీఆర్‌సీతో పోల్చి చూడాలన్నారు. రెండు రాష్ట్రాల పీఆర్‌సీలను పక్కపక్కన పెట్టి చూస్తే.. అప్పులు అసలైన తేడా తెలుస్తుందన్నారు. అనవసరమైన వ్యాఖ్యలు ఎందుకని మంత్రి బొత్స నిప్పులు చెరిగారు.

Exit mobile version