NTV Telugu Site icon

Botsa Satyanarayana: మంత్రి బొత్స సవాల్.. పవన్ కళ్యాణ్‌కి ఆ ప్రకటన చేసే దమ్ముందా?

Botsa Challenges Pawan

Botsa Challenges Pawan

Botsa Satyanarayana Challenges Pawan Kalyan: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్‌కి ఓ సవాల్ విసిరారు. రాజ్యాధికారం కోసం రెండు పార్టీలతో సంబంధాలు ఉన్నప్పటికీ.. నాయకత్వం మాదేనని ప్రకటించే దమ్ము పవన్ కళ్యాణ్‌కి ఉందా? అని ఛాలెంజ్ చేశారు. విశాఖపట్నంలో మంత్రి బొత్స మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే తాపత్రయంతోనే ఆయనపై బురదజల్లే ఆలోచనలో పవన్ ఉన్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌ది కేవలం ఒక సెలబ్రిటీ పార్టీ అని, మూడ్ వచ్చినప్పుడు మాత్రమే పవన్ మాట్లాడుతుంటారని, ఆయన వైఖరి చూస్తుంటే జాలేస్తుందని చెప్పారు. నిర్దిష్టమైన లక్ష్యం ఉంటే.. నీతి, నిజాయితీతో పోరాడాలని సూచించారు. ఆ విధంగా చేస్తే.. ఏ 30 ఏళ్లకో అవకాశం వస్తుందని, అప్పటివరకు ఎన్ని చేసిన వేస్ట్ అని తేల్చి చెప్పారు.

Kapil Sharma: అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కపిల్ శర్మ సంచలన వ్యాఖ్యలు

రాజకీయాల్లోకి వచ్చాక తాను టాటా బిర్లాల మాదిరిగి ఎదిగిపోయానని పవన్ వ్యాఖ్యానిస్తున్నారని.. వాళ్ల మాదిరి తానెక్కడ ఎదిగిపోయానో పవన్ చెప్పగలరా? అని బొత్స ప్రశ్నించారు. బలహీన వర్గాలకు వైసీపీ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటి పార్టీ అని వెల్లడించారు. మా ప్రభుత్వానికి, పార్టీకి బీసీలు బ్యాక్ బోన్ అని ముఖ్యమంత్రి బహిరంగంగానే చెప్పారని గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో బీసీలకు జరుతున్న అన్యాయంపై పవన్ ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. తనకంటే ముందే కాపు కులం నుంచి చాలామంది మంత్రులు వచ్చారని చెప్పిన ఆయన.. తాను వ్యక్తిగతంగా ఎంత అభివృద్ధి చెందానో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలని అడిగారు. గంటకో కులం అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. కులం, మతం అనేది సమాజంలో ఒక భాగమైపోయిందని అన్నారు. తాను కాపు కులంలో పుట్టి.. రాజకీయంగా ఎదిగానని ధైర్యంగా చెప్పుకుంటానన్నారు.

Gun Culture: గన్‌కల్చర్‌పై కన్నెర్ర.. ఒకే రోజు 813 తుపాకీ లైసెన్సులు రద్దు

రాష్ట్ర రాజకీయాల్లో నేను కూడా ఉన్నానని చెప్పుకునే ప్రయత్నంలోనే.. తనలాంటి వాళ్ల పేర్లను పవన్ ఉటంకిస్తుంటారని మంత్రి బొత్స కౌంటర్ వేశారు. నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, రాజకీయ లక్ష్యం ఉన్న వాళ్ళు.. రాజకీయ అవగాహన, అసెంబ్లీ జరిగే విధానం తెలుసుకోవాలని సూచించారు. టీడీపీతో భాగస్వామిగా ఉన్న సమయంలో.. బీసీలకు జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్‌కు గుర్తు రాలేదా? అని నిలదీశారు. మహాయజ్ఞం జరుగుతుంటే.. భగ్నం చేసే రాక్షసులుగా టీడీపీ నాయకులు మారారని విమర్శించారు. ఆ రాక్షసుల్ని దాటుకొని తాము ముందుకు వస్తామన్నారు. ఇక రేపటి నుంచే సీఎం జగన్ విశాఖకు రావాలని తన కోరిక అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.