NTV Telugu Site icon

Bopparaju Venkateswarlu: మూడో దశ ఉద్యమ కార్యాచరణను వెల్లడించిన ఏపీ జేఏసీ ఛైర్మన్

Bopparaju Venkateswarlu

Bopparaju Venkateswarlu

Bopparaju Venkateswarlu Revealed Third Phase Of Agitation: ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తాజాగా మూడో దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం తాము రెండు దశల్లో ఉద్యమం పూర్తి చేస్తామన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏపిలో ఉన్న 13 లక్షల మంది ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ తరఫున రెండు దశల్లో ఉద్యమం పూర్తి చేశాం. రెండో దశ ఉద్యమం పూర్తవుతున్న నేపథ్యంలో.. మూడో దశ ఉద్యమ పోరాటంపై ఉద్యోగసంఘాలతో పాటు కార్మిక సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. రౌండ్ టేబుల్ సమావేశం ముందు రోజు మంత్రి ఉపసంఘం చర్చలకు పిలిచింది. ఈ భేటీలో ఏ అంశం తేలకపోవడంతో.. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. ఈ సమావేశంలో కార్మిక సంఘాలు పూర్తి మద్దతు తెలిపాయి’’ అంటూ తెలిపారు. తాము నల్లబ్యాడ్జీలు ధరించే ఉంటామని.. 8వ తేదిన ఉపాధ్యాయులపై అక్రమ కేసులు ఉపసంహరించాలని గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు.

Kodali Nani: చంద్రబాబు, రజనీకాంత్‌లకు భవిష్యత్తు లేదు

9వ తేది నుండి ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు.. మొదటి సదస్సును శ్రీకాకుళం నుండి ప్రారంభిస్తామన్నారు. ఈ సదస్సుకు విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లా ఉద్యోగులు హాజరవుతారన్నారు. 53 రోజుల నుండి ఉద్యమం చేస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెతన్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మే 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉద్యోగుల ఆవేదన చెబుతామనే కార్యక్రమం ద్వారా.. రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలకు, 25 ఎంపీలకు వినతి పత్రాలు అందిస్తామన్నారు. రెండో ప్రాంతీయ సదస్సు అనంతపురం, మూడో ప్రాంతీయ సదస్సు ఏలూరులో నిర్వహిస్తామన్నారు. మే 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఒక రోజు నిరాహార దీక్ష చేపడతామన్నారు. నాలుగో ప్రాంతీయ సదస్సు గుంటూరులో చేస్తామన్నారు. 53 రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ.. ప్రభుత్వం అస్సలు స్పందించడం లేదన్నారు. రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తే, అక్రమ కేసులు ఉద్యోగులపై బనాయించడానికి ప్రభుత్వం చూస్తుందా? అని ప్రశ్నించారు. ఈ ఉద్యమాన్ని చూలకనగా చూడొద్దన్న ఆయన.. మూడో దశ ఉద్యమం ద్వారా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపిస్తామన్నారు.

CM KCR: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై మొదటి సంతకం చేసిన సీఎం కేసీఆర్