కర్నూలు జిల్లా గార్గేయపురం చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాల మిస్టరీ వీడటం లేదు. ముందుగా నగరవనం వైపు చెరువు ఒడ్డున ఒకే ప్రాంతంలో రెండు మృతదేహాలు కనిపించడగా.. ఆ తరువాత అవతలి ఒడ్డున మరో మహిళ మృతదేహం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మహిళల మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించడం లేదు. గుర్తు తెలియని ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారా.. ప్రమాదవశాత్తు పడిపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారా.. పరిచయస్తులా అనేది తెలియాల్సి ఉంది.
READ MORE: Uttar Pradesh: రాహుల్ గాంధీ-అఖిలేష్ యాదవ్ సభలో తొక్కిసలాట.. కార్యకర్తల మధ్య ఘర్షణ..
సమీప ప్రాంతాల్లోని పీఎస్ లలో మహిళలు మిస్సింగ్ అయినట్టు ఫిర్యాదులు రాలేదని పోలీసులు పేర్కొన్నారు. డీఐజీ విజయరావు, ఎస్పీకృష్ణకాంత్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గతంలో ఎక్కడైనా ఇలా మృతదేహాలు బయటపడ్డాయా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు పోలీసులు. సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా సంఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగరవనంకు పర్యాటకులు, ప్రేమాజంటలు వస్తున్న నేపథ్యంలో ఆ కోణంలోను దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.