Black Magic: క్షుద్రపూజల కలకలం.. బాలుడ్ని నరబలి ఇవ్వబోతుండగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Black Magic In NTR District: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు మండలం పరిధిలోని చౌటపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. టేకులపల్లి-చౌటపల్లి గ్రామాల సరిహద్దుల్లో లంకెబిందెలు ఉన్నాయని.. క్షుద్రపూజలు చేసేందుకు 8 మంది నిందితులు వచ్చారు. వారి వెంట ఒక పూజారితో కూడా ఓ చిన్న బాలుడు కూడా ఉన్నాడు. వీళ్లంతా కార్లలో గ్రామానికి చేరుకొని, అర్థరాత్రి తిరుగుతూ గ్రామస్తులకు కనిపించారు. బాలుడ్ని చూసి.. అతన్ని నరబలి ఇవ్వడానికే తెచ్చారని స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో గ్రామస్తులు ఆ నిందితుల వద్దకు వెళ్లి నిలదీశారు. ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. దీంతో గ్రామస్తులు వారిని దేహశుద్ధి చేశారు. ఈ క్రమంలో నలుగురు నిందితులు గ్రామస్తుల చెర నుంచి తప్పించుకొని, అక్కడి నుంచి పారిపోయారు. మరో నలుగురు పారిపోతుండగా.. వారిని పట్టుకున్నారు.
Viral Video: మద్యం మత్తులో బీభత్సం.. కారును ఢీకొట్టి 3కి.మీ లాక్కెళ్లి.. వీడియో వైరల్
Also Read
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వాళ్లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులు పట్టుకున్న నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులంతా బుగ్గపాడు, తిరువూరు, ఏరుకోపాడు, టేకులపల్లి వాసులని తేలింది. నిందితులు వచ్చిన కారును సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గుప్తనిధులు ఉన్నాయనే సమాచారంతో ఆ నిందితులు పూజలు చేయడానికి వచ్చారని అనుమానిస్తున్న పోలీసులు.. ఆ బాలుడ్ని నరబలి ఇవ్వడానికి తీసుకొచ్చారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. గ్రామస్తులు మాత్రం ఆ బాలుడ్ని నరబలి ఇవ్వడానికే తెచ్చారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఈ ముఠా వెనుక పెద్ద వ్యక్తుల హస్తం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితులకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!