NTV Telugu Site icon

రేపు ఏపీ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు

ఏపీ వ్యాప్తంగా రేపు బీజేపీ నిరసన చేపట్టేందుకు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర సుంకం తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయానికి మద్దతుగా బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు మరొ కొన్ని రాష్ట్రాలు సైతం పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర సుంకాన్ని తగ్గించాయి.

ఈ నేపథ్యంలో ఏపీలోనూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై సుంకాన్ని తగ్గించాలని ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం ఇంధన ధరలపై రాష్ట్ర సుంకాన్ని తగ్గించాలంటూ బీజేపీ శ్రేణులు నిరసనలకు ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సుంకాన్ని తగ్గించకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.