Site icon NTV Telugu

GVL: అన్ని రాష్ట్రాలకంటే ఏపీకే కేంద్రం నిధులు ఎక్కువ.. చర్చకు మేం రెడీ..

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, బీజేపీ నేతల మధ్య ఎప్పుడూ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది.. ముఖ్యంగా కేంద్రం.. ఏపీకి కేటాయించిన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు బీజేపీ నేతలు.. తాజాగా, బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఈ వ్యవహారంలో హాట్‌ కామెంట్లు చేశారు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ఏపీకి కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించిందన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులతో పథకాలకు తమపేర్లు పెట్టుకుని సొంత డబ్బాలు కొట్టుకుంటున్నారని మండిపడ్డారు.. కేంద్రం కరోనా సమయంలో 20 నెలలపాటు ఉచిత బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేసిన ఆయన.. గత ఆరేళ్లలో 24 వేల కోట్లు ఆహార సబ్సిడీ కింద ఏపీకి ఇచ్చామని.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేసిందన్న దానిపై వైసీపీ నేతలతో బీజేపీకి చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.. ఇక, అబద్దాలు ప్రచారాలు చేసి వైసీపీ, టీడీపీ ప్రజలను మభ్య పెడుతున్నాయని ఆరోపించిన జీవీఎల్‌ నరసింహారావు.. కేంద్ర ప్రభుత్వం సాయం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతాయన్నారు.

Read Also: BJP: ఏపీ చిరకాల కోరిక మా వల్లే సాధ్యమైంది-సోము వీర్రాజు

Exit mobile version