Site icon NTV Telugu

Railway Development: ఇతర రాష్ట్రాల కంటే ఏపీకి అదనపు నిధులు.. రైల్వే రంగంలో అద్భుత అభివృద్ధి..!

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

Railway Development: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైల్వే రంగంలో అద్భుత అభివృద్ధి సాధిస్తుందని ప్రశంసలు కురిపించారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు.. గుంటూరు రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఎంపీ నిధుల నుండి ఏర్పాటు చేసిన స్టీల్ బెంచిలను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా రైల్వే రంగంలో అద్భుత అభివృద్ధి సాధిస్తున్నారు.. గుంటూరు రైల్వే స్టేషన్ ను రాబోయే రోజుల్లో 20 కోట్ల రూపాయాలతో అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. గుంటూరు, గుంతకల్ మధ్య డబ్లింగ్ పనులు 2025 నాటికి పూర్తి అవుతాయని వెల్లడించిన ఆయన.. నడికుడి, శ్రీకాళహస్తి రైల్వే లైన్ లో రాష్ట్ర ప్రభుత్వ నిధులు పెండింగ్ వల్ల పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు.. ఇక, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో ఆంధ్రప్రదేశ్‌లో రైలు పండుగ జరుగుతుందన్నారు.. రైల్వే ప్రయాణ సౌకర్యం కోసం ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించినట్టు వెల్లడించారు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.. కాగా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్‌ రైల్‌ పరుగులు పెడుతోన్న విషయం విదితమే.. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ఈ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తోంది.. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే.

Read Also: Women Missing Case: మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

Exit mobile version