Site icon NTV Telugu

PVN Madhav: బీజేపీతో టీడీపీ, వైసీపీ మైండ్ గేమ్..!

Pvn Madhav

Pvn Madhav

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు.. ప్రతిపక్ష తెలుగు దేశం కూడా భారతీయ జనతా పార్టీతో మైండ్‌ గేమ్‌ ఆడుతున్నాయని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కారణం అన్నారు.. ఇప్పటికీ బిల్లులు మ్యానువల్ గా జరగడం వెనుక ఉద్దేశ్యాలను ప్రశ్నిస్తున్నాం.. ఆర్ & ఆర్ నిర్ధారణ, నిర్వాసితుల గుర్తింపు లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు.. కేంద్రం నిధులు ఇస్తే పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పడం అర్ధరహితం అని మండిపడ్డ ఆయన… అప్పు చేసైన ప్రాజెక్ట్ నిర్మాణం రాష్ట్రం పూర్తి చేస్తే బిల్లులను కేంద్రం తిరిగి చెల్లిస్తుందన్నారు.. ఇక, విశాఖ రైల్వేజోన్ పై అపోహలకు ఆస్కారమే లేదు… జోన్ ఏర్పాటులో ఉన్న సాంకేతిక ఇబ్బందులను సైతం దాటి పూర్తి చేయాలనే నిశ్చయంతో కేంద్రం ఉందని స్పష్టం చేశారు.

Read Also: Supreme Court: అబార్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మరోవైపు.. టీడీపీ, వైసీపీలు బీజేపీతో మైండ్ గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు ఎమ్మెల్సీ మాధవ్… అన్నీ కేంద్రానికి చెప్పే చేస్తున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతుంటే.. త్వరలోనే పొత్తు పెట్టుకుంటున్నామని టీడీపీ ప్రచారం చేసుకుంటున్నాయి… వీటి వెనుక ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీని ఎదగ కుండా చేస్తున్న కుట్ర కనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్ని విషయాల్లో సహకారం అందిస్తూనే ఉంది.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ సపోర్ట్ చేసింది.. మరోవైపు.. జనసేనతో పాటు బీజేపీతోనూ పొత్తు కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం సాగుతూనే ఉంది.. కొన్నిసార్లు.. రాజకీయ నేతల కామెంట్లు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version