NTV Telugu Site icon

సీమ ప్రాజెక్టులపై బీజేపీ ఫోకస్‌..! ఎల్లుండి కీలక భేటీలు..

BJP

BJP

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోన్న సమయంలో.. చర్చలకు సిద్ధమైంది భారతీయ జనతా పార్టీ.. ఎల్లుండి కర్నూలులో రాయలసీమ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాయలసీమ పదాధికారులు, ఎనిమిది జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. రాయలసీల ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడికాలువ, గుండేగుల, వేదవతి ప్రాజెక్టులపై బీజేపీ నేతలు చర్చించనున్నారు.. ప్రాజెక్టుల అంశంలో భవిష్యత్‌ కార్యక్రమాన్ని కూడా రూపొందించనున్నారు.

మరోవైపు.. ఎల్లుండి తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలోని కీలక అంశాలపై చర్చించనున్నారు.. రైతు సమస్యలతో పాటు కృష్ణా జలాలు, నిరుద్యోగ సమస్య, హుజురాబాద్‌ ఉప ఎన్నికపై చర్చించనున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. దీంతో.. రెండు రాష్ట్రాల బీజేపీ సమితిలు.. జల వివాదం, ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి స్టాండ్‌ తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది..