Site icon NTV Telugu

Vishnuvardhan Reddy: సీఎంకి అబద్దాలు చెప్పడంలో అవార్డు ఇవ్వొచ్చు..!

Vishnuvardhan Reddy

Vishnuvardhan Reddy

ఆంధప్రదేశ్‌ అప్పుల రాష్ట్రంగా మారింది.. 365 రోజులు ఓడీ తీసుకుంటున్నారు… ఏపీ ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్నారు.. ఆర్థిక క్రమశిక్షణ లేని రాష్ట్రం ఏపీ.. సలహాదారులు మాత్రం చాలా మంది ఉన్నారు.. అబద్దాలు చెప్పడంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఓ అవార్డు ఇవ్వొచ్చు అంటూ సెటైర్లు వేశారు.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి… అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.. ప్రపంచంలోనే అతి పెద్ద రక్తదాన శిబిరం ఇవాళ జరుగుతుందన్నారు.. అయితే, నిన్న సీఎం జగన్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై స్పందించిన ఆయన.. జగన్‌కి అబద్దాలు చెప్పడంలో ఒక అవార్డు ఇవ్వొచ్చు అంటూ ఎద్దేవా చేశారు.

Read Also: Amit Shah Convoy: అమిత్‌ షా కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చిన కారు.. అద్దాలు పగులగొట్టిన ఎస్పీజీ

ఏపీలో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు విష్ణువర్ధన్‌రెడ్డి.. చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలంటూ రోడ్డెక్కారు.. జగన్ కు నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం ఉందంటూ సెటైర్లు వేశారు.. జగన్ పాలనలో మనుషులను చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీ ఇస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయారని ఆరోపించారు.. ఇక, బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 5 వేల వీధి సభలు పెడుతున్నాం… వైసీపీ పాలన పై 56 కరపత్రాలు పంచిపెడుతాం అన్నారు.. ప్రజా పోరు పేరుతో 19న ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తామని వెల్లడించారు విష్ణువర్ధన్‌రెడ్డి.

Exit mobile version