Site icon NTV Telugu

ఏపీలో పెట్రో మంట.. సీఎంను టార్గెట్ చేసిన బీజేపీ

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు కొత్త రికార్డులు సృష్టించాయి.. దీంతో.. పెట్రోల్‌ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇక, కేంద్రం దారిలోనే మరికొన్ని రాష్ట్రాలు అడుగులు వేశాయి.. ఇప్పటికే దాదాపు ఎనిమిది రాష్ట్రాలు పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి.. ఇందులో ఒడిశా మినహా మిగతా రాష్ట్రాలన్నీ బీజేపీ లేదా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలే కావడం విశేషం.. అయితే, తెలుగు రాష్ట్రాలో అధికారంలో ఉన్న పార్టీలు మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోకపోగా.. తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా కనిపించడం లేదు. దీంతో.. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్‌ను.. ఏపీలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పెద్ద వారే నడుస్తుండగా.. ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ను టార్గెట్‌ చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ ధియోధర్..

సీఎం వైఎస్‌ జగన్‌పై మండిపడ్డ సునీల్‌ ధియోధర్‌.. ఫెయిల్యూర్ సీఎం వైఎస్‌ జగన్‌ అంటూ ఘాటు వ్యాఖ్యలు… ఏపీలో పరిపాలన అస్థవ్యస్థంగా మారిందన్న ఆయన.. రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారన్నారు.. ఏపీలో పెట్రోల్, డీజిల్ పై పన్నుల రేట్లను తగ్గించకపోతే రాష్ట్ర ప్రజలు క్షమించరంటూ హెచ్చరించారు.. ఇక, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్, పెట్రోల్ ధరలు చాలా ఎక్కువన్న బీజేపీ నేత.. పాలన చేతకాకపోతే భారం ప్రజలపైనే పడుతుందన్న విషయం జగన్ రెడ్డికి తెలుసా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version