కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీపై క్లారిటీ ఇచ్చారు జనసేనాని పవన్ కల్యాణ్. అనంతపురం జిల్లాలో పర్యటించిన పవన్ .. బద్వేల్ బై ఎలక్షన్స్‌లో తాము పోటీ చేయబోమని స్పష్టం చేశారు. తమది విలువలతో కూడుకున్న పార్టీయన్న జనసేనాని… సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన స్థానంలో అభ్యర్థిని నిలుపబోమని చెప్పారు. స్థానికంగా ఉండే జనసేన నాయకులతో చర్చించిన తర్వాతే.. పోటీపై నిర్ణయం తీసుకున్నామన్నారు పవన్ కల్యాణ్. మరణించిన ఎమ్మెల్యే భార్యకే.. టికెట్ ఇచ్చినందున జనసేన పోటీ చేయడం లేదన్నారు. ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీకి సూచించారు.
ఈనెల 30న బద్వేల్ బై పోల్ కోసం.. ఇప్పటికే వైసీపీ.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు అభ్యర్థుల్ని ప్రకటించాయి. జనసేన, బీజేపీ కూడా ఉమ్మడిగా రంగంలోకి దిగుతాయనే ప్రచారం జరిగింది. అయితే, జనసేనాని తీసుకున్న నిర్ణయంతో.. ఒక్కసారిగా లెక్కలు మారినట్టు తెలుస్తోంది. బద్వేల్ లో పోటీకి ఆసక్తి చూసిస్తున్న బీజేపీ.. మిత్రపక్షం జనసేన నిర్ణయంతో ఇరకాటంలో పడినట్టు తెలుస్తోంది. టీడీపీ ఏకగ్రీవానికి సహకరిస్తుందా? జనసేనని కాదని బీజేపీ ఒంటరిగా బరిలో నిలుస్తుందా? అనే మొదలైంది. మరి, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.