Site icon NTV Telugu

Somu Veerraju: అభివృద్ధిలో మోడీ హీరో.. జగన్ జీరో…!

Somu Veerraju

Somu Veerraju

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై మరోసారి హాట్‌ కామెంట్లు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… తూర్పగోదావరిజిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన… అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోడీ హీరో… సీఎం జగన్మోహన్‌రెడ్డి జీరో అని వ్యాఖ్యానించారు… కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ నర్సరీలను సందర్శించి పులకించి పోయారు… నేషనల్ హైవేలకు కడియం మొక్కలు ప్రతిపాదన తీసుకువచ్చారన్న ఆయన… కడియంలో యూనివర్సిటీ తెచ్చేలా ఆలోచన చేస్తున్నారని తెలిపారు.. ఇక, చంద్రబాబు హయాం నుండి జిల్లాలో కడియం అనపర్తి రోడ్స్ ఎవ్వరూ చేయలేక పోయారు.. అది కేంద్రం వల్లే సాధ్యమవుతుందన్నారు సోము వీర్రాజు. రాజమండ్రిలో ఉన్న రోడ్లు అన్ని. 14,15 ఫైనాన్స్ లో నరేంద్ర మోడీ వేయించిన రోడ్లేనన్న ఆయన.. మోసపూరిత ప్రభుత్వాలను… కుటుంబ పార్టీలను… తరమికొట్టాలి… భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్నారు.. ఇక, డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి.. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా తీర్మానం చేయడంపై స్పందించిన సోము వీర్రాజు… ఎన్టీఆర్ పేరు మారిస్తే రాష్ట్ర ప్రభుత్వం పతనం తప్పదు అని జోస్యం చెప్పారు.

Read Also: Nitin Gadkari: ఆటో మొబైల్, ఎలక్ట్రిక్ రంగాల్లో 4 కోట్ల ఉద్యోగాలు.. దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచాలి..

Exit mobile version