NTV Telugu Site icon

Biryani for One Rupee: రూపాయికే బిర్యానీ.. ఎగబడ్డ జనం.. మన దగ్గరే..!

Biryani

Biryani

Biryani for One Rupee: బిర్యానీకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజే వేరు.. మెచ్చిన రెస్టారెంట్‌లో నచ్చిన బిర్యానీ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికైనా.. ఎంత దూరం వెళ్లడానికైనా.. ఫుడ్‌ డెలివరీ యాప్‌లో ఆర్డర్లు చేయడానికైనా వెనక్కి తగ్గరు.. అదే, రూపాయికే బిర్యానీ వస్తుందంటే మాత్రం ఆగుతారా? అదే ఇప్పుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది.. ఒక్క రూపాయికే బిర్యానీ ఆఫర్‌ విషయం తెలుసుకున్న బిర్యానీ ప్రియులు, ప్రజలు.. పెద్ద ఎత్తున తరలిరావడంతో.. తోపులాట.. ట్రాఫిక్‌ జామ్‌.. చివరకు పోలీసులు కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది..

Read ALso: PM Modi: రేపు చెన్నైకి ప్రధాని మోదీ.. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం, వందేభారత్‌ రైలు ప్రారంభం

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మార్కాపురంలో ఓ ప్రైవేట్‌ రెస్టారెంట్‌ ప్రారంభించారు.. ఈ సందర్భంగా రూపాయికే బిర్యానీ ఆఫర్‌ పెట్టారు.. రూపాయి అంటే రూపాయే కానీ.. పాత రూపాయి నోట్‌ ఉండాల్సిందే.. పాత రూపాయి నోట్‌ తీసుకొని వస్తే దమ్‌ బిర్యానీ అంటూ ఆఫర్‌ ఇచ్చారు.. దీంతో.. జనం పెద్దఎత్తున తరలివచ్చారు.. ఆ తాకిడిని తట్టుకోలేక మధ్యాహ్నం వరకే బిర్యానీ పంపిణీ నిలిపివేయాల్సి వచ్చింది నిర్వాహకులు.. అయితే, బిర్యానీ కోసం భారీ స్థాయిలో ప్రజలు తరలిరావడంతో.. తోపులాట జరిగింది.. అంతేకాదు.. మార్కాపురం – కంభం రహదారిపై భారీగా ట్రాఫిక్‌ కూడా నిలిచిపోయింది. ఇక, రూపాయికే బిర్యానీ దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. చిన్నా పెద్ద, ఆడ, మగా అని తేడా లేకుండా ఎగబడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి..

Show comments