NTV Telugu Site icon

Biryani Offer: నంద్యాలలో 1 పైస, 5 పైసలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం.. రచ్చ రచ్చగా మారిపోయింది..

Biryani

Biryani

దేనిపై ఆఫర్‌ ఇచ్చినా ఎగడడి కొనేస్తుంటారు.. ఇక, ఇష్టమైన బిర్యానీపై ఆఫర్‌ అంటే వదులుతారా..? వందలాది మంది తరలివచ్చారు.. తోపులాట, ఘర్షణ, ట్రాఫిక్‌ జామ్‌ వరకు వెళ్లింది వ్యవహారం.. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని చక్కదిద్దేందుకు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.. అసలు ఆఫర్‌ ప్రకటించి న్యూసెన్స్‌ క్రియేట్‌ చేసిన ఆ హోటల్‌ను కూడా మూసివేయించారు.. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.. ఇంత రచ్చ దేనికి జరిగిందంటే.. కేవలం ఐదు పైసలకే బిర్యానీ అంటూ తెచ్చిన ఆఫరే..

Read Also: Pension: పెన్షనర్లకు న్యూఇయర్‌ కానుక..

నంద్యాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పద్మావతి నగర్‌లోని ఓ రెస్టారెంట్ ఐదు పైసలకే బిర్యానీ ఆఫర్‌ తెచ్చింది.. పాతకాలం నాటి ఒక పైసా, ఐదు పైసల నాణెం ఇస్తే బిర్యాని ఫ్రీ అని ప్రకటించింది యాజమాన్యం.. దీంతో.. వందలాది మంది తరలివచ్చారు.. యువకులు, మహిళలు.. ఇలా పెద్ద సంఖ్యలో క్యూకట్టారు.. అది కాస్తా తోపులాటకు దారితీసింది.. ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.. దీంతో, రెస్టారెంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.. ఆఫర్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించివేశారు యువకులు.. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో.. గుంపులను చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీఛార్జ్‌ చేశారు పోలీసులు.. చివరకు రెస్టారెంట్ ను మూయించారు పోలీసులు.. రెస్టారెంట్ పై కేసులు పెడతామని తెలిపారు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి..