NTV Telugu Site icon

Andhra Pradesh: ప్రతి ఉమ్మడి జిల్లాలో బయోడైవర్సిటీ పార్క్

Bio Diversity Park Min

Bio Diversity Park Min

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు కానుంది. బయో డైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేసి ప్రజల్లో పర్యావరణం పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో విశాఖ, కాకినాడ, తిరుపతి, కడపలో నాలుగు బయో డైవర్సిటీ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒక్కో పార్కుకు రూ.కోటి, మ్యూజియానికి రూ.50 లక్షల చొప్పున జీవవైవిధ్య మండలి మంజూరు చేయనుంది.

Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో 6 ఎకరాలు, కాకినాడలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్‌లో 7.5 ఎకరాలు, తిరుపతిలోని తుడా పరిధిలో ఉన్న వెంకటాపురంలో 6 ఎకరాలు, కడప నగరంలో ఏపీఐఐసీకి చెందిన 6 ఎకరాలను ఇప్పటికే బయోడైవర్సిటీ పార్కుల కోసం అధికారులు కేటాయించారు. ఈ భూములను త్వరలో జీవవైవిధ్య మండలికి అప్పగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు రెండో దశలో కర్నూలు, అమరావతి, అనంతపురం జిల్లాల్లోనూ త్వరలో బయోడైవర్సిటీ పార్కులను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.