Bike Buy With 10 Rupee Coins:10 రూపాయల నాణేలు చెల్లడంలేదని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.. ఈ దెబ్బతో బయట ఎక్కడా 10 రూపాయల కైన్ ఇచ్చినా ఎవరూ తీసుకోవడం లేదు.. ఇచ్చేవారు ఉన్నా పుచ్చుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు.. అంతలా 10 రూపాయల నాణెంపై ఓ ముద్ర పడిపోయింది.. అలాంటి ఏమీలేదో మొర్రో అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్లారిటీ ఇచ్చినా.. కిందిస్థాయిలో మాత్రం.. 10 కైన్‌పై చిన్నచూపే ఉంది.. చివరకు బిక్షాటన చేసేవారు సైతం ఆ నాణెలు తీసుకోవడం లేదంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అయితే, ఇలాంటి అసత్యప్రచారాన్ని పటాపంచలు చేశాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు.. మొత్తం 10 రూపాయల నాణేలు సేకరించి.. తనకు ఇష్టమైన బైక్‌ను కొనుగోలు చేసి ఔరా..! అనిపించాడు.. 10 రూపాయల కైన్స్‌తో బైక్‌ను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు..
Read Also: Kottu Satyanarayana: పవన్ కల్యాణ్‌ది మా సామాజిక వర్గం.. నాకు అభిమానం ఉండదా..?
ఏపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన బొబ్బిలి రాఘవేంద్ర అనే యువకుడు.. కేవలం 10 రూపాయల నాణేలను సేకరించి వాటితోనే బైక్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు.. ఏకంగా రూ. 1.65 లక్షల విలువ చేసే 10 రూపాయల నాణేలు సేకరించాడంటే.. దాని వెనుక ఆ యువకుడి కష్టం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, ఆ నాణేలతో షోరూమ్‌కు వెళ్లి రాఘవేంద్ర. తన దగ్గర మొత్తం 10 రూపాయల కైన్స్ ఉన్నాయని.. వాటితోనే బైక్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్టు షోరూమ్ నిర్వహకులు తెలిపారు.. వారు కూడా వెంటనే అంగీకరించారు.. అయితే, రూ. 10 నాణేలు మార్కెట్‌లో చెల్లుబాటు కావడం లేదనే తరచూ వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని, ఈ అపోహలు తొలగించేందుకు 10 రూపాయల నాణేలతోనే బైక్ కొనుగోలు చేయాలని అనుకున్నాను.. అదే చేశానని వెల్లడించాడు రాఘవేంద్ర.
మొత్తంగా తనకు ఇష్టమైన hero xpulse 200 4v బైక్ సొంతం చేసుకున్నాడు రాఘవేంద్ర.. అతడికి స్నేహితులు, షోరూమ్ సిబ్బంది అభినందనలు తెలిపారు.. అయితే, హైదరాబాద్‌లో ఓ సంస్థలో పనిచేసే రాఘవేంద్ర.. చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. కానీ, బైక్ షోరూమ్ నిర్వాహకులు పెద్ద పనే పెట్టాడు.. ఎందుకంటే.. రూ.1.65 లక్షల విలువైన 10 రూపాయల నాణేలు లెక్కించడానికి వారికి ఎక్కువ సమయమే పట్టింది.. ఇక్కడ మాత్రం.. 10 రూపాయల కైన్స్ చలామణిలోనే ఉన్నాయి.. అందరూ తీసుకోవచ్చు.. చెల్లించవచ్చు అనే సందేశాన్ని ఇస్తూనే.. తన డ్రీమ్ బైక్ సొంతం చేసుకున్నాడు ఆ యువకుడు..