NTV Telugu Site icon

AP Deputy CM: ఏపీ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఊరట

Pawan

Pawan

AP Deputy CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు ఊరట లభించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసు క్వాష్ చేయాలని పవన్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కేసు విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులపై ప్రభుత్వం రివిజన్ చేస్తోందని కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్.. తదుపరి విచారణ 4 వారాలకి వాయిదా వేస్తునట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది.

Read Also: Viral Video: వెజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ ఫుడ్ ఇచ్చిన వెయిటర్‌.. చివరకు.?

అలాగే, మరోవైపు ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పరిధిలో ఉన్న శాఖల పని తీరును మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు. నేడు( మంగళవారం) పవన్ కళ్యాణ్‌తో అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ సమావేశం అయ్యారు. లార్సన్ టీమ్ ను ఆయన సత్కరించారు. ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై ఇరువురి మధ్య ప్రత్యేక చర్చ కొనసాగింది.. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే యువతకు సహకారం ఇవ్వాలని పవన్ కోరారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారు.. వారి ప్రతిభకు తగిన ఛాన్సులు అందించడంలోనూ, మార్గనిర్దేశనం చేయాలని కోరారు. పర్యావరణహితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.