NTV Telugu Site icon

Bhuma Akhila Priya: వాళ్లు వై నాట్ 175 అంటే.. మేం వై నాట్ పులివెందుల అంటున్నాం..

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికలు వచ్చేశాయా? అనే తరహాలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లకు కొదవేలేదు.. ఎమ్మెల్యే ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించిన టీడీపీలో కొత్త జోష్‌ కనిపిస్తోంది.. దీంతో.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీయే.. సీఎం అయ్యేది చంద్రబాబే అంటున్నారు ఆ పార్టీ నేతలు.. నంద్యాలలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ.. వై నాట్ 175 అని వైసీపీ నేతలు అంటున్నారు.. కానీ, మేం వై నాట్ పులివెందుల అంటున్నాం అన్నారు.. వైసీపీ ప్రభుత్వం, నాయకులు తీసుకున్న నిర్ణయాలతోనే రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చాయన్న ఆమె.. సీఎం వైఎస్‌ జగన్ కేసుల నుండి తప్పించుకోవడానికి, ఎమ్మెల్యేలు, నాయకులు చేసే అరాచకాల్ని కప్పిపుచ్చేందుకే అధికారంలోకి వచ్చినట్టుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Read Also: Ladakh: లడఖ్‌లో త్వరలోనే 4జీ, 5జీ సేవలు.. 500 మొబైల్ టవర్లు మంజూరు

ఇక, మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, ఒకరినొకరు కొట్టుకుంటుంటే లబ్ధి పొందాలనే నీచమైన ఆలోచనతో పరిపాలన చేశారు అంటూ మండిపడ్డారు భూమా అఖిలప్రియ.. రాష్ట్ర ముఖ్యమంత్రి దారిలో కనబడిన ఎమ్మెల్యేలను గుర్తు కూడా పట్టలేడు అంటూ ఎద్దేవా చేసిన ఆమె.. మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎమ్మెల్యే, బంధువు, ప్రజలు ఎవరైనా సరే.. ఎదురు చెప్పకూడదు.. అనే మీ ఆలోచన ఎంతో నష్టం కలిగిస్తుందని సూచించారు. వై నాట్ 175 అన్నారు.. కానీ, మేము వై నాట్ పులివెందుల అంటున్నాం అని ప్రకటించారు మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ.