వైభవంగా దేవి నవరాత్రులు ముగిసినా ఇంద్రకీలాద్రిపై భవానిలా రద్దీ కొనసాగుతుంది… రాజరాజేశ్వరి రూపంలో దర్శనం ఇస్తున్న దుర్గమ్మను దర్శించుకోవటానికి భవానీలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. భవానీల రద్దీతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది… భవాని నామస్మరణతో దుర్గమ్మ కొండా మార్మోగుతుంది. దసరా ముగిసిన నిన్నటి అలంకారమే ఇవాళ కూడా భక్తులకు దర్శనం ఇవ్వటంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భవాని భక్తులు తరలి వస్తున్నారు… ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిగిన దేవి నవరాత్రుల్లో అంచనాకు మించి భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. నిన్నటితో దసరా ముగిసిన కొండపై భవానిలా రద్దీతో ఇంకా దసరా వాతావరణం కనిపిస్తుంది.. దూర ప్రాంతాల నుండి కాలినడకతో దుర్గమ్మను దర్శించుకోవటానికి భవాని భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దాంతో భవాని నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది.. అమ్మవారిని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భవాని భక్తులు కాలి నడకన వస్తున్నారు. ఇవాళ ఇంద్రకీలాద్రిపై భారీ వర్షం కురుస్తున్నా కూడా ఎక్కడా భవానిలా దర్శనాలు ఆగలేదు.
Read Also: Polavaram Project: పోలవరంపై నేడు కీలక సమావేశం.. ఎవరి వాదన ఏంటి..?
ప్రతి ఏడాది దసరా వచ్చిందంటే చాలు చాల మంది అమ్మవారి భక్తులు నవరాత్రులు అయిపోయే వరకు అమ్మవారి మల ధరిస్తారు… కొంతమంది కార్తీక మాసంలో మాలలు దారిస్తే మరికొంత మంది దసరాలో భవాని మాల ధరిస్తారు.. వాళ్లలో చాల మంది ఇంద్రకీలాద్రి కిందే గురు భవానీలతో మల వేయించుకుని 9 రోజుల తర్వాత మళ్లీ అక్కడే మాల విరమణ చేసేస్తారు… అయితే, ఈ ఏడాది భవానీలు ఇంద్రకీలాద్రిపై ఎలాంటి ఏర్పాట్లు చెయ్యకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు.. కనీసం హోమ గుండం అయినా ఏర్పాటు చెయ్యాలని కోరినప్పటికీ వైదిక కమిటీ నిర్ణయం మేరకు అది జరగలేదు… దాంతో చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చి.. వారు ఎక్కడ మాల వేసుకున్నారో అక్కడే విరమణ కూడా చేసుకున్నారు. దసరా చివరి రోజు నిన్న, ఇవాళ ఇంద్రకీలాద్రిపై భవాని భక్తుల తాకిడి పెరగటంతో అక్కడి ఏర్పాట్లను కూడా అలానే ఉంచేశారు ఆలయాధికారులు… రేపు కూడా మరింత మంది భవానీలు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.