NTV Telugu Site icon

Beeda Ravichandra: మంత్రుల డ్యూటీ విపక్షాన్ని తిట్టడమేనా?

Beeda Raviu

Beeda Raviu

ఏపీ మంత్రివర్గ విస్తరణ విమర్శల పాలవుతోంది. ప్రతి పక్షాన్ని తిట్టేందుకేనా మంత్రులు వున్నదని తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్. ప్రజలకు పని చేయటం కోసం మంత్రి పదవులివ్వలేదన్నది కెబినెట్ చూస్తే అర్థమవుతోంది. ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కాలంటే అవినీతి, మాఫియా, భూకబ్జాలే అర్హతలు అన్నారు.

Also Read: Atchannaidu: ఆక్వారంగాన్ని ఉరితీసిన జగన్

వైఎస్ కుటుంబాన్ని తిట్టిన వాళ్లకూ మంత్రివర్గంలో చోటు కల్పించారు. వైఎస్ దోపిడీని బయటపెట్టడం లేదా కలిసి దోపిడీ చేయటమే మంత్రులు కావటానికి అర్హతలా ..? ప్రజా సమస్యలపై సీఎం స్పందిస్తున్న తీరు ఆయన బలహీనతను బయటపెడుతోంది. 11మంది పాతవారిని తిరిగి తీసుకోవటంతోనే జగన్ తాను అనుకున్న మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారన్నది స్పష్టం చేస్తోందన్నారు. మంత్రివర్గ విస్తరణ షాడో పరిపాలనను తలపిస్తోందన్నారు. మంత్రులందరినీ మారుస్తానన్న సీఎం ఎందుకు సగం మందినే మార్చారన్నారు.