Site icon NTV Telugu

Bapatla: వినాయక చవితి రోజు విషాదం.. తామర పూల కోసం వెళ్లి ఇద్దరు బాలురు మృతి

Pond

Pond

Bapatla: ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సైతం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తోన్న వేళ.. విషాద ఘటన చోటు చేసుకుంది.. వినాయక చవితి రోజు బాపట్ల జిల్లాలో విషాద ఘటన జరిగింది.. తామర పూల కోసం వెళ్లి చెరువులో పడి ఇద్దరు బాలురు ప్రాణాలు విడిచారు.. ఈ ఘటనలో బాపట్ల జిల్లాలోని పూండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు మృతిచెందారు.. వినాయక చవితి పర్వదినం సందర్భంగా.. తామర పూల కోసం చెరువులోకి దిగారు ఇద్దరు బాలురు.. మృతులు పూండ్ల గ్రామానికి చెందిన 17 ఏళ్ల సైకం నాగభూషణం, 15 ఏళ్ల సుద్దపల్లి శ్రీమంత్ గా గుర్తించారు.. శ్రీమంత్ 9 వతరగతి చదువుతుండగా.. నాగభూషణం ఇంటర్ చదువుతున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

Read Also: Delhi: గాజాలో జర్నలిస్టుల హత్యను ఖండించిన భారత్.. మృతులకు విదేశాంగ శాఖ సంతాపం

Exit mobile version