NTV Telugu Site icon

Balineni Srinivasa Reddy: బాలినేని సంచలనం.. గెలిపించే బాధ్యత వాలంటీర్లదే..!

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. వాలంటీర్‌ వ్యవస్థపై తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ వాలంటీర్ల వ్యవస్థని ఏర్పాటు చేశారన్న ఆయన.. వైసీపీ పార్టీ నాయకులు చెప్పిన వారిని వాలంటీర్లుగా నియమించామని తెలిపారు. ఇక, వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే దానికి ముఖ్య కారకులు వాలంటీర్లే అన్నారు బాలినేని.. అంతేకాదు.. గడప గడపకే నేను తిరుగుతాను.. కానీ, నన్ను గెలిపించే బాధ్యత వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిదే నంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చగా మారింది.

Read Also: Janasena: మహిళలకు రక్షణ ఎక్కడ? సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదు!

మరోవైపు, మంత్రి పదవిలో నుండి మిమ్మల్ని ఎందుకు తీసేశారని నన్ను కొంత మంది అడుగుతున్నారు.. బంధువు కాబట్టి మంత్రి పదవి నుండి తొలగించానని సీఎం వైఎస్‌ జగన్‌ చెబుతున్నారని తెలిపారు బాలినేని.. నన్ను అడ్డం పెట్టుకుని చాలా మందిని మంత్రి పదవి నుండి తొలగించానని కూడా తెలిపారని వెల్లడించారు. అయితే, ప్రభుత్వ పథకాల అమలు కోసం పనిచేయాల్సిన వాలంటీర్లపై బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చర్చగా మారాయి. ఇక, 2024లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.