Site icon NTV Telugu

Balineni Srinivasa Reddy: ఏపీని దేశంలోనే అగ్రగామికి నిలబెట్టేందుకు సీఎం జగన్ కృషి

Balineni Srinivas Reddy

Balineni Srinivas Reddy

Balineni Srinivasa Reddy On AP Capital Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామికి నిలబెట్టేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ మొదటి నుంచి ఓ విజన్‌తో ముందుకు వెళ్లే నాయకుడని అన్నారు. విశాఖపట్టణంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిత్‌తో.. దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందన్నారు. ఏపీకి పెట్టుబడి పెట్టేవాళ్లు లేరని ప్రచారం చేసేవారికి.. విశాఖ సమ్మిట్‌తో సీఎం జగన్ చెంపఛెళ్లుమనిపించేలా సమాధానం ఇచ్చారన్నారు. ఏపీలో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారన్నారు.

Ambati Rambabu: మానవ తప్పిదం వల్లే పోలవరానికి తీవ్ర నష్టం.. ప్రాజెక్ట్‌పై మంత్రి సమీక్ష

ముకేష్ అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలు.. ముందుండి విశాఖ సమ్మిట్‌ను విజయవంతం చేశారని బాలినేని అన్నారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలోని లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. గతంలో టీడీపీ హాయంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే విశాఖను రాజధానిగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఆల్రెడీ డెవలప్ అయిన సిటీని మరింత వేగంగా అభివృద్ది చేయవచ్చన్నారు. అమరావతి లాంటి ప్రాంతాన్ని అభివృద్ది చేయాలంటే.. లక్షల కోట్లు కావాలన్నారు. రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ప్రజలకు అర్థమైందని వెల్లడించారు.

Uttar Pradesh: యూపీలో దారుణం..ఒకే సిరంజితో చాలా మందికి ఇంజెక్షన్.. అమ్మాయికి హెచ్ఐవీ పాజిటివ్..

Exit mobile version