Karumuri Nageswara Rao: జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవిని, సినిమా వాళ్ళని ఎంత గౌరవించి పంపారో ఆయన లేఖ ద్వారా బయట పడింది అని వైసీపీ నేత, మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. అసెంబ్లీలో చిరంజీవి మీద నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ నాగబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించకపోవడం శోచనీయం అన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన రోజురోజుకి దిగజారి పోతుంది.. ఒక ఎమ్మెల్యేనే లంచాలు తీసుకొని పనులు చేస్తున్నామని చెప్పే పరిస్థితి వచ్చింది.. నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు అంటున్నారు.. కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వంగా మారిపోయింది అని మాజీ మంత్రి కారుమూరి ఆరోపించారు.
Read Also: Rain Alert : వదలా అంటున్న వానలు.. ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలే..!
ఇక, రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేక పంటలను రోడ్ల మీద పారబోస్తున్నారు అని వైసీపీ నేత నాగేశ్వరరావు తెలిపారు. రైతులు పండించిన 37 వేల కోట్ల రూపాయల విలువైన సంపద ఆవిరైపోయింది.. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగింది.. చంద్రబాబు పాలనలో రాష్ట్రంపై విపరీతమైన అప్పులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని పేర్కొన్నారు.
