B Pharmacy Student Collapse: వయస్సుతో సంబంధం లేకుండా.. పిల్లలు, యువకులు, పెద్దవాళ్లు, వృద్ధులు అనే తేడా లేకుండా.. ఈ మధ్య కాలంలో గుండె ఆగిపోయి ఎంతో మంది ప్రాణాలు విడిచారు.. ఆడుతూ కొందరు.. పాడుతూ మరికొందరు.. శుభకార్యంలో ఇంకా కొందరు.. ఇలా ఎక్కడపడితే అక్కడ.. అనే తేడా లేకుండా గుండె పోటుతో కన్నుమూస్తున్నారు.. తాజాగా, ఈ జాబితాలో ఓ బీఫార్మసీ విద్యార్థి చేరాడు.. 19 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయంటూ.. ఈ లోకాన్ని వదిలేశాడు.. స్నేహితులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడుతుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. ఆస్పత్రిలో మృత్యువుతోపోరాడి ఓడిపోయాడు.
Read Also: Kishan Reddy: కేసీఆర్‌కు జవాబిచ్చే సంస్కారం లేదు.. కిషన్ రెడ్డి ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం పట్టణంలోని PVKK కాలేజీలో మొదటి సంవత్సరం బీఫార్మసీ చదువుతున్న తనూజ నాయక్ అనే 19 ఏళ్ల విద్యార్థి.. ఈనెల 1వ తేదీన కాలేజీ గ్రౌండ్‌లో కబడ్డీ ఆడాడు.. సరదాగా స్నేహితులతో కలిసి కబడ్డీ ఆడుతోన్న సమయంలో.. ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు తనూజ నాయక్.. దీంతో, ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.. బెంగళూరులోని రామయ్య ఆస్పత్రిలో చికిత్స అందించారు.. కానీ, మృత్యువుతో ఆ యువకుడి పోరాటం ఎక్కువరోజులు కొనసాగించలేకపోయాడు.. ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచాడు తనూజ నాయక్.. మృతి చెందిన విద్యార్థి స్వస్థలం మడకశిర మండలం ఈ అచ్చంపల్లి తాండాగా చెబుతున్నారు.. చేతికొస్తున్న కొడుకు.. ఇలా మధ్యలోనే ప్రాణాలు వీడడంతో.. ఆ కుటుంబంలో.. ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మరోవైపు.. ఎవరికి ఎప్పుడు.. గుండి ఆగిపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉందంటా.? అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.