NTV Telugu Site icon

Ayyannapatrudu: ఎన్ని కేసులు పెట్టినా..నన్నేం పీకలేరు

Ayyanna1

Ayyanna1

ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు. భవిషత్తులో చేయను. నేను బ్రతికి ఉన్నంత కాలం ఏ తప్పూ చేయను. బెయిల్ పై నర్సీపట్నం తన స్వగృహానికి వచ్చిన అనంతరం తన రాక కోసం అభిమానంతో ఎదురుచూస్తున్న నాయకులు కార్యకర్తలు అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు అయ్యన్నపాత్రుడు. నాయకులు, కార్యకర్తల రుణం తీర్చుకుంటాను..నా కుటుంబానికి అండదండగా ఉన్న అందరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు అన్నారు అయ్యన్న.

Read ALso: Kaleshwaram Gravity Canal: విషాదం.. కెనాల్ లో స్నానానికి దిగి తండ్రి కొడుకులు మృతి

అయ్యన్న పాత్రుణ్ణి ఏం పీకలేరు కాబట్టి.. కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. నీవు దోచుకుంటున్నావు… దాచుకుంటున్నావు.. దాన్ని అవసరమైతే లేదని ఆరోపణలు నిరూపించుకో అంటూ పరోక్షంగా సీఎంకు సవాల్ విసిరారు. రోడ్లు మీద గుంతలు పూడ్చలేకపోతున్నావు..ఇసుక అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నావు..పరిపాలన చేతకాక, దాన్ని మభ్య పెట్టేందుకు మా మీద కేసులు పెట్టి ఇంకా ఎన్నాళ్లు ఇలా కాలం గడుపుతారు..నా మీద 14 కేసులు పెట్టి నన్ను ఏం పీకావు..రేపు 2024లో నిన్ను రాష్ట్రంలో ప్రజలు తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందన్నారు.

అధికార పక్షం తప్పుచేస్తే.. దాన్ని విమర్శించడం ప్రతిపక్షంగా మా ధర్మం..నీవు వీలైతే చేసిన తప్పుల్ని సరిచేసుకో.ఎన్ని కేసులు పెట్టినా .. నా మాట ఒక్కటే..నీకు దమ్ముంటే, మగతనం ఉంటే నామీద చూపించు..అయ్యన్నపాత్రుణ్ణి కొట్టి, లైవ్ లో చూద్దామని అనుకున్నావు. నా వల్ల ఇంతమంది నా కుటుంబ సభ్యులు నాయకులు ఎందుకు ఇబ్బంది పడవలసి వస్తోంది అన్న విషయంపైనే నేను బాధ పడాల్సి వస్తోందన్నారు అయ్యన్నపాత్రుడు.ఇదిలా వుంటే.. అమరావతి హైకోర్టులో అయ్యన్నపాత్రుడు లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ ఇవాళ జరగనుంది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టెయ్యాలంటూ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అయ్యన్నపాత్రుడు. ఆయనకు రిమాండ్ విధించేందుకు జడ్జి నిరాకరించిన సంగతి తెలిసిందే.

Read Also: Rajendranagar ATM: బ్యాంక్ సిబ్బందినే బురిటీ కొట్టించిన డ్రైవర్.. రూ.36 లక్షలతో పరార్