Site icon NTV Telugu

Minister Venugopal: అయ్యన్న అలాచేస్తే.. చూస్తూ ఊరుకోవాలా?

ayyanna vs venugopal

Collage Maker 03 Nov 2022 01.13 Pm

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి అరెస్ట్ కలకలం రేపుతోంది. ఆయన అరెస్ట్‌ కి సంబంధించి సీఐడీ వివరాలు అందచేసింది. అయ్యన్న ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించారనే అంశంపై సెప్టెంబర్ 30వ తేదీన సీఐడీకి ఫిర్యాదు అందింది. సీఐడీకి ఫిర్యాదు చేశారు ఇరిగేషన్ ఈఈ కె. మల్లిఖార్జున రావు. ఇరిగేషన్ ఈఈ ఫిర్యాదు మేరకు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీఐడీ. ఏ-1గా అయ్యన్న, ఏ-2గా విజయ్, ఏ-3గా రాజేష్. ఐపీసీ 464, 467, 471, 474 రెడ్ విత్ 120-బి, 34 సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఎన్వోసీని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కాపీని కోర్టుకు పంపినట్టు స్పష్టం చేసింది సీఐడీ.

ఇటు జెసి ప్రభాకర్ రెడ్డి అయ్యన్న పాత్రుడి అరెస్ట్ ని ఖండించారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి అరెస్ట్ దారుణం .ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. నేటి ప్రభుత్వ పాలన స్వాతంత్రోద్యమం నాటి రోజులను తలపిస్తోందన్నారు. టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అయ్యన్నపాత్రుడి అరెస్టుపై తీవ్ర విమర్శలు చేశారు. అయ్యన్నపాత్రుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యన్న కుటుంబంపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. బీసీలపై రోజురోజుకూ దాడి పెరిగిపోతుంది. అయ్యన్న అరెస్ట్ పై బీసీ మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు? సివిల్ కేసు కోసం రాత్రి సమయంలో అరెస్ట్ ఎందుకు చేశారు..? అయ్యన్నపాత్రుడుకి ప్రాణ హాని ఉంది. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులను వదిలేది లేదన్నారు బుద్దా వెంకన్న.

అయ్యన్న సమర్పించినవి ఫోర్జరీ అని ఎవరు చెప్పారు..? ఫోర్జరీ డాక్యుమెంట్లపై సీఐడీ అరెస్టు చేయాల్సి వస్తే తొలుత మంత్రి ధర్మానను అరెస్టు చేయాలి. ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్వాతంత్ర్య సమర యోధుల భూములను ధర్మాన కొట్టేయలేదా..? బీసీలను చూస్తే జగనుకు ఎందుకు బీపీ పెరుగుతోంది? అన్నారు టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. టీడీపీకి బీసీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే బీసీలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. బాబాయి హత్యకు సంబంధించి చెల్లి షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం పక్కదోవ పట్టించేందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో బలంగా ఉన్న బీసీలను దెబ్బతీసే కుట్రలో భాగంగానే సీఐడీ ముసుగులో జగన్ దూరాగతాల సాగిస్తున్నారు. రుషికొండ అక్రమాలపై అయ్యన్నది అలుపెరగని పోరాటం అన్నారు కాల్వ శ్రీనివాసులు. రుషికొండపై ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై వైసీపీ ఏమంటుంది..?అని సూటిగా ప్రశ్నించారు.

Read Also: Apple: ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. అప్పటి నుంచి ఆపిల్ ఫోన్లలో 5జీ సేవలు

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్ ను నిరసిస్తూ పెద్దాపురంలో ఆందోళన చేపట్టారు టీడీపీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నవీన్, వరుపుల రాజా. చిన రాజప్ప మాట్లాడుతూ.. పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చెయ్యడం అప్రజాస్వామికం. సీఐడీ బాస్ అధికార పార్టీకి తొత్తుగా మారారు…తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. గతంలో వైసీపీకి వన్ సైడ్ గా ఫెవర్ చేసిన డీజీపీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో సీఐడీ బాస్ తెలుసుకుని వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. కనీస ప్రోటో కాల్స్ లేకుండా అరెస్టు చేసిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను.. బేషరతుగా అయ్యన్నను విడుదల చేయాలని ట్విట్టర్లో గంటా శ్రీనివాస రావు డిమాండ్ చేశారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్ర పురంలో మంత్రి వేణుగోపాల కృష్ణ మీడియాతో మాట్లాడారు. అయ్యన్న పాత్రుడు అరెస్ట్ ను బి సీ ల మీద దాడి గా చిత్రీకరిస్తున్నారు. ఆయనపై ఉన్న అభియోగాలకి సీ ఐ డి కేసు నమోదు చేసింది. విచారణ కి అయ్యన్న పాత్రుడు సహకరించాలి. అయ్యన్న పాత్రుడు తప్పులు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? టీ డీ పీ నాయకులు గోల చేస్తున్నారని మండిపడ్డారు. ముగ్గురు వ్యక్తులపై ఆరోపణలు ఉన్నాయన్నారు ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్ నాయక్. ఈ కేసుకి సంబంధించి చింతకాయల అయ్యన్నపాత్రుడు, చింతకాయల విజయ్, చింతకాయల రాజేష్ పై ఫోర్జరీ ఎన్ఓసీ ఆరోపణలు వున్నాయన్నారు.

Read Also: Munugode Bypoll Polling Live Updates: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ లైవ్ అప్ డేట్స్

Exit mobile version