NTV Telugu Site icon

Ayyanna Patrudu vs Ganta Srinivasa Rao: అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు.. ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు..!

Ayyanna Patrudu

Ayyanna Patrudu

Ayyanna Patrudu vs Ganta Srinivasa Rao: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు.. ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు..! లక్షల్లో నేనొక్కడిని అంటూ సంచలన కామెంట్లు చేశారు.. గంటా ఏమైనా పెద్ద నాయకుడా..? ప్రధానా..? అంటూ ప్రశ్నించిన ఆయన.. పార్టీలో అందరూ రావాలి.. పని చేయాలన్నారు.. కష్టకాలంలో కూడా పార్టీ కోసం పని చేయాలనేదే మా కోరిక అని స్పష్టం చేశారు.. మేం ఎవ్వరికీ వ్యతిరేకులం కాదు.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ వస్తున్నారని ఫైర్‌ అయ్యారు.. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉండాలనే మేం కోరుకుంటున్నామన్న ఆయన.. అలా అండగా ఉండని వారిని చూస్తేనే మాకు బాధేస్తుందన్నారు.. మాకు అందరూ కావాలి. పార్టీ కష్టకాలంలో దూరంగా ఉన్నవాళ్లు కూడా బాగుండాలనే కోరుకుంటామన్నారు.

Read Also: BJP Leader Elopes: సమాజ్‌వాదీ పార్టీ నేత కుమార్తెతో పారిపోయిన బీజేపీ నాయకుడు

టీడీపీకి మొదట్నుంచి బడుగులే అండగా ఉన్నారని తెలిపారు అయ్యన్నపాత్రడు.. టీడీపీ బీసీలకే పెద్ద పీట వేసింది.. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా బీసీలు టీడీపీకి అండగానే ఉన్నారన్న ఆయన.. సాఫ్ట్ వేర్ కంపెనీ.. హార్డ్ వేర్ కంపెనీలే కాదు.. అండర్ వేర్ కంపెనీలు కూడా పోతున్నాయని ఎద్దేవా చేశారు.. జాకీ అండర్ వేర్ కంపెనీని కేటీఆర్ పట్టుకుపోయారు.. రాజధాని లేని దిక్కుమాలిన రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో టీడీపీ బీసీ నేతల సమావేశం ఉంటుంది.. మూడు ప్రాంతాల్లో బీసీ సదస్సులు పెడతామని ప్రకటించారు. బ్రాందీ షాపులను 25 ఏళ్ల తనఖా పెట్టి.. రూ. 8700 కోట్లు అప్పు తెస్తారా..? అని ఎద్దేవా చేశారు. బ్రాందీ షాపులను తనఖా పెట్టిన దౌర్బాగ్యుడని తెలియక ప్రజలు ఓటేశారని ఫైర్ అయ్యారు.. దావోస్ సదస్సుకు అందరికీ ఒకే ఆహ్వానిస్తారని మంత్రి అమర్నాథ్‌కు తెలీదా..? అని ప్రశ్నించారు.. పక్క రాష్ట్రం ఐటీ మంత్రి ఏం చేస్తున్నారో చూసి నేర్చుకో అమర్నాథ్‌ అంటూ హితవుపలికారు.. మాలాంటి వారిని తిట్టడానికే అమర్నాథ్‌కు మంత్రి పదవి ఇచ్చారు అంటూ ఎద్దేవా చేశారు అయ్యన్నపాత్రుడు.

కాగా, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై అయ్యన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి.. అయితే, తన రాజకీయ భవిష్యత్తుపై ఈ మధ్యే క్లారిటీ ఇచ్చారు గంటా.. తాను టీడీపీలోనే ఉన్నానని.. రెండేళ్లు కోవిడ్‌, తర్వాత తన అనారోగ్య కారణాల వల్లే పార్టీలో యాక్టివ్‌గా ఉండలేకపోయానని చెప్పారు. మధ్యలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని.. ఇప్పటి నుంచి యాక్టివ్‌గా ఉంటానని చెప్పారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో ఆయన విగ్రహానికి గంటా శ్రీనివాసరావు పూలమాల సమర్పించి నివాళులర్పించారు. లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నారా లోకేష్ పాదయాత్ర సంచలనం సృష్టించడం ఖాయమని అన్నారు. 400 రోజులు 4 వేల కిలోమీటర్లు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేయడం సంచలన విషయమని గంటా చెప్పుకొచ్చిన విషయం విదితమే.