తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని ఆయన వెల్లడించారు. 1983లో అతి చిన్న వయస్సు ఎమ్మెల్యేను నేనని, జీవితంలో మరిచిపోలేని సంఘటనలు ఉన్నాయన్నారు. 1985లో మరోసారి ఎన్నికలు వచ్చాయి. రెండేళ్ళ లోనే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఖర్చులు ఉంటాయని ఎన్టీఆర్ కు చెబితే.. నా భుజం మీద చేయి వేసి ఫోటో దిగారు. ఈ ఫోటోతో ఇల్లుల్లు తిరుగు గెలిస్తావ్ అని చెప్పారు. ముఖానికి రంగేసుకునే వారికి రాజకీయ ఏంటని అన్నారు.
1985లో నన్ను మంత్రిని చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యంకు గురి చేశాయి. మున్సిబ్ కర్ణాలు, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయాలని క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఆ వ్యవస్థను రద్దు చేయొద్దని ఎందరో చెప్పిన ఒకే ఒక సంతకంతో వ్యవస్థ రద్దు చేశారు. ఆయన దగ్గర పని చేయడం మా అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. రామారావు, టీడీపీ సిద్ధాంతాలు ఈతరం వారికి చెప్పాలని, ఆనాటి రాజకీయ విలువలు ఈతరం వారికి చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎక్కువ శాతం సీట్లు యువతకు ఇవ్వాలని నా అభ్యర్థన అని, చదువుకున్న వారికి సీట్లు ఇస్తే మళ్ళీ 40, 50సంవత్సరాలు అధికారంలో ఉంటామన్నారు.
