NTV Telugu Site icon

Avanthi Srinivas: మాజీ మంత్రి అవంతికి కోవిడ్ పాజిటివ్

కరోనా మరో విడత తన ప్రతాపం చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఏపీ మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ప్రస్తుతం ఆయన త‌న ఇంటిలోనే ఐసోలేష‌న్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అవంతి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందని వైద్యులు తెలిపారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అవంతి వైసీపీ టికెట్‌పై భీమిలి నుంచి పోటీకి దిగి విజ‌యం సాధించారు.

ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డంతో జ‌గ‌న్ తొలి కేబినెట్‌లో ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా అవంతి అవకాశం చేజిక్కుంచుకున్నారు. ఇటీవ‌లే జ‌రిగిన మంత్రివ‌ర్గ పున‌ర్వ్యవ‌స్థీక‌ర‌ణ‌లో అవంతి శ్రీనివాస్ మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. పార్టీ బాధ్యతలు ఆయన చూసుకుంటున్నారు. తిరుపతి జిల్లాలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన వారిలో రుయాలోని ముగ్గురు వైద్యులు వున్నారు. మరో వైపు దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ ప్రభావం కనిపిస్తోంది. కోవిడ్ ఎక్కువగా వ్యాపించే మహారాష్ట్రలో గవర్నర్ కోషియారీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోవిడ్ బారిన పడ్డారు. రోజువారి కేసులు 12 వేలకు పైగా నమోదవుతున్నాయి. పాజిటివిటి రేట్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. తక్కువగానే పరీక్షలు చేస్తున్న కొత్త కేసుల సంఖ్య పెరగడం వైద్య వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.

చుండ్రు సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు