వేపనూనె, ఆలివ్ ఆయిల్‌లను కలిపి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేయాలి
అల్లం ముక్కను సన్నగా కట్ చేసి, నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి, గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా వారంలో ఒకసారి చేస్తే చాలు
అరటి పండు గుజ్జులో 2 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి
నారింజ తొక్కను పేస్ట్‌లా చేసి, తలకు పట్టించాలి. గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో 2 నుంచి 3 సార్లు చేయాలి
ఒక కప్పు నీటిలో 2-3 టేబుల్ స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 10 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. వారానికి ఓసారి ఇలా చేస్తే చాలు
బేబీ ఆయిల్‌ను తలకు పట్టించి, వెచ్చని నీళ్లలో ముంచిన టర్కీ టవల్‌ను చుట్టుకోవాలి. 15 నిమిషాల తరువాత స్నానం చేయాలి. వారంలో ఇలా 2 సార్లు చేయాలి
కలబంద గుజ్జును తలకు పట్టించి, 15 నిమిషాల తరువాత స్నానం చేయాలి. చుండ్రు సమస్య తగ్గడంతో పాటు శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి