Site icon NTV Telugu

AV Subbareddy: భుజాల మీద ఎత్తుకొని పెంచితే.. చున్నీ లాగానంటోంది

Av Subbareddy On Bhuma

Av Subbareddy On Bhuma

AV Subbareddy Reacts On Bhuma Akhila Priya Allegations: తన చున్నీ లాగారంటూ మాజీమంత్రి అఖిల ప్రియ చేసిన ఆరోపణలపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తాజాగా స్పందించారు. ‘‘నిన్ను నేను బుజాల మీద ఎత్తుకొని పెంచాను, చున్ని లాగాను అనడం దారుణం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. నాగిరెడ్డి పబ్లిక్ మీటింగ్‌లలో ఏవీ, భూమా వేరు కాదని ఎన్నోసార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలికే విషయంలో.. సపరేట్ టెంట్ వేసి, గ్రూపు రాజకీయాలు చేశావంటూ అఖిలపై ధ్వజమెత్తారు. నంద్యాలలో టీడీపీ ఇంచార్జీ బ్రహ్మనంద రెడ్డి, ఫరూక్ ఉన్నప్పుడు.. నంద్యాలలో పార్టీ ఆఫీస్ పెట్టడమేంటని ప్రశ్నించారు. తలచుకుంటే తాను ఆళ్ళగడ్డలో సొంతంగా టీడీపీ ఆఫీస్ పెట్టగలనని, కానీ నేను పార్టీ సిదాంతాలకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.

MLA Housemaid Suicide: ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్న మహిళ ఆత్మహత్య.. కేసులో షాకింగ్ ట్విస్ట్

తాను తప్పు చేసి ఉంటే పోలీసులకు ఆధారాలు ఇవ్వాలని, అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారని ఏవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. తనకు అవమానం జరగడంతో పాటు దెబ్బలు తగిలితే.. అఖిల ప్రెస్‌మీట్ పెట్టి తిట్టడమేంటని నిలదీశారు. అఖిల ప్రియ అనుచరులు కర్నూలు, జమ్మలమడుగు ప్రాంతాలకు చెందిన రౌడీ షీటర్లని ఆరోపించారు. వాళ్ళను అఖిల తన వెంట ఎందుకు తిప్పుకుంటుందో పోలీసులను అడుగుతానన్నారు. భార్గవ్ రాము మీద పొలీసులు ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేయలేదు? అని ప్రశ్నించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ వీడనని తేల్చి చెప్పారు. ఒకవేళ పార్టీ తనని దూరం పెడితే.. అప్పుడు కూడా ఇంట్లో కూర్చొని బాధ పడతానే తప్ప, పార్టీ మాత్రం మారనని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే.. తాను నంద్యాలలో లేదా అళ్ళగడ్డలో పోటిచేస్తానని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అఖిల ప్రియ సొంతంగా మీటింగ్ పెడితే.. జనాలు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.

Adipurush: రోజుకి 100 కోట్లు! మండేకి ఆల్ రికార్డ్స్ అవుట్?

అంతకుముందు.. లోకేష్ పాదయాత్రలో తాము పాల్గొనకూడదని కుట్ర పన్నారని, ఏవి సుబ్బారెడ్డి తనను వెనుక నుంచి తోసి వేశారని, తాను కళ్లు కనపడడం లేదా అని ప్రశ్నించినందుకు చున్నీ లాగి అవమానించారని అఖిల ప్రియ ఆరోపణలు చేశారు. ఏవీ సుబ్బారెడ్డి తన చున్నీ లాగి అవమానించినందుకే.. తన కార్యకర్తలు కొట్టారని, తాను కొట్టలేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏవీ సుబ్బారెడ్డి పై విధంగా స్పందించారు.

Exit mobile version