Site icon NTV Telugu

Tirupati: సబ్‌ రిజిస్టర్ కార్యాలయంలో అటెండర్ దౌర్జన్యం.. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరింపు

Tirupati

Tirupati

తిరుపతి సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో హైడ్రామా నెలకొంది. కార్యాలయంలో అటెండర్ నానా హంగామా సృష్టించాడు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయాలంటూ మహిళా సబ్ రిజిస్టర్‌పై అటెండర్ దౌర్జన్యానికి దిగాడు. రెండు రోజుల క్రితం పెట్రోల్ పోసుకుని చనిపోతానంటూ డ్రామా నడిపాడు.

ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూర్‌లో మరో శ్రద్ధావాకర్.. ఫ్రిజ్‌లో 32 ముక్కలుగా మహిళ శరీర భాగాలు..

నకిలీ పత్రాలతో కడప జిల్లాకు చెందిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే మూల పత్రాల పరిశీలన తర్వాతే పెండింగ్ రిజిస్ట్రేషన్ పత్రాలు విడుదల చేస్తానంటూ రిజిస్టర్ చెప్పడంతో అటెండర్ దూషణల పర్వానికి దిగాడు. అంతేకాకుండా మహిళా ఆఫీసర్‌పై దాడికి కూడా యత్నించాడు. తాజా ఘటనపై ఉన్నతాధికారులకు రిజిస్టర్ ఫిర్యాదు చేశారు. అటెండర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. అటెండర్ గతంలోనూ పలు అక్రమాలకు పాల్పడినట్లు ఉద్యోగులు చెప్పారు.

ఇది కూడా చదవండి: Uttar Pradesh: విషాదం.. ఆలయ గోడ కూలి శిథిలాల కింద నలుగురు సమాధి..!

Exit mobile version