Atmakuru BYPOLL: ఆన్‌లైన్ ద్వారా నామినేషన్ల డేటా ఎంట్రీకి ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నామినేషన్ ఫార్మ్, అఫిడవిట్‌లో వ్యక్తిగత సమాచారాన్ని పొందుపర్చేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. అంతేకాకుండా నామినేషన్లు దాఖలు చేయడానికి అపాయింట్‌మెంట్, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు అనుమతులను పొందే అవకాశాన్ని భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు www.suvidha.eci.gov.in పోర్టల్ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికను ఈ ఏడాది జూన్ 23న నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 25న షెడ్యూల్ జారీచేసినట్లు ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఉప ఎన్నికల ప్రకటనతో ఈ నెల 25 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, అన్ని రాజకీయ పార్టీలు అప్పటి నుండి ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలని ఆయన కోరారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలు జూన్ 6 లోగా చేసుకోవాల్సి ఉందని, నామినేషన్ల పరిశీలన జూన్ 7 జరుగుతుందని, ఉపసంహరణకు జూన్ 9 చివరి తేదీ అని ఆయన తెలిపారు. జూన్ 23 న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఉప ఎన్నిక జరుగుతుందని, ఓట్ల లెక్కింపు జూన్ 26న జరుగుతుందని, ఈ ఉప ఎన్నిక ప్రక్రియ మొత్తం జూన్ 28 లోపు పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు.
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
కాగా ఈ ఏడాది జనవరి 5 నాటికి ప్రచురించబడ్డ తుది ఓటర్ల జాబితా ప్రకారం తదుపరి జూన్ 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకున్న ఓటర్లను కూడా ఈ ఎన్నికలో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఆత్మకూరు శాసన సభా నియెజక వర్గానికి సంబందించి మే 29 నాటికి మొత్తం 2 లక్షల 16 వేల 5 మంది జనరల్, సర్వీసు ఓటర్లు నమోదు అయిఉన్నట్లు ఆయన తెలిపారు. ఆత్మకూరు శాసన సభా నియోజక వర్గం పరిధిలో 278 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ప్రతి 1250 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున అదనంగా ఒక తాత్కాలిక ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు సంబంధిత రాజకీయ పార్టీలు కూడా పోటీ చేసే అభ్యర్థి క్రిమినల్ యాంటిసిడెంట్స్‌ను ప్రచార కాలంలో మూడు సందర్భాల్లో పలు వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లల ద్వారా ప్రచారం చేయాల్సి ఉందని ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. నామినేషన్ల ఉప సంహరణకు మొదటి నాలుగు రోజులలోపు ఒకసారి, ఐదో రోజు నుండి 8వ రోజు మధ్య మరోసారి, తొమ్మిదో రోజు నుండి చివరి రోజు ప్రచారం లోపు మరో సారి అభ్యర్థుల క్రిమినల్ యాంటిసిడెంట్స్‌ను పలు వార్తాపత్రికలు, టీవీ ఛానళ్ల ద్వారా ప్రచారం చేయాల్సి ఉందని అన్ని పార్టీల ప్రతినిధులకు ఆయన సూచించారు. కోవిడ్ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాలను ఈ ఎన్నికల నిర్వహణలో తప్పక పాటించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, స్టార్ క్యాంపెయినర్లు కోవిడ్ మార్గదర్శకాలను ఏ మాత్రం అతిక్రమించినా తదుపరి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వబోమని ఆయన స్పష్టంచేశారు.
ఆత్మకూరు ఉప ఎన్నిక నిర్వహణకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధరబాబు జిల్లా ఎన్నికల అధికారిగా.. జాయింట్ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ రిట్నరింగ్ అధికారిగా వ్యవహరిస్తారని ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఉప ఎన్నికకు సంబందించి వీరితో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సీహెచ్.విజయరావును కూడా సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!