Site icon NTV Telugu

Atchannaidu : బొత్సకు వైన్ షాపుల సంఖ్య తప్ప పాఠశాలల సంఖ్య తెలుసా

Atchannaidu

Atchannaidu

జగన్ అసమర్ధ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరో సారి సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు వాయిదాలకు అలవాటు పడి పడి.. పరీక్ష ఫలితాలు వాయిదా వేస్తే ఎలా జగన్..? అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి బొత్సకు తన వైన్ షాపుల సంఖ్య తప్ప రాష్ట్రంలో‎ పాఠశాలల సంఖ్య తెలుసా..? అంటూ ఆయన విమర్శించారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల వాయిదాపై విద్యార్దులకు సమాధానం చెప్పండని, ఇవాళే ‎ఫలితాలు వస్తాయని 6 లక్షల మంది విద్యార్ధులు ఎంతో ఆశతో ఎదురు చూశారన్నారు.

ముందుగానే పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి చివరి నిమిషంలో వాయిదా వేయటం ఏంటి? ఫలితాల వాయిదా అధికారులు, మంత్రి మధ్య సమన్వయ లోపమా? లేక జగన్ ప్రభుత్వ చేతకానితనమా? అని ఆయన ప్రశ్నించారు. విద్యార్దులకు, వారి తల్లితండ్రులకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. అసమర్ద పాలనతో విధ్యార్ధుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతారా? మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తిని.. జగన్ విద్యాశాఖ మంత్రిని చేశారన ఆయన మండిపడ్డారు.

Exit mobile version