Site icon NTV Telugu

Atchannaidu: మహానాడుకు తరలివెళ్తాం.. చీమల దండులా కదులుతాం..!

Atchannaidu

Atchannaidu

మహానాడు నిర్వహణకు సిద్ధం అయ్యింది తెలుగుదేశం పార్టీ.. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో మహానాడు జరగనుంది.. అయితే, మహానాడు సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభ కోసం జనసమీకరణ చేయడకుండా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. రవాణా శాఖ అధికారులను అడ్డుపెట్టుకొని ఎవరూ వాహనాలు ఇవ్వొద్దని ఒత్తిడి తెస్తున్నారని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించిన విషయం తెలిసిందే.. అయితే, మహానాడు తెలుగుజాతి పండుగ.. మహానాడుకు తరలివెళ్తాం.. అవసరమైతే నడిచి వస్తామని ప్రకటించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

Read Also: Somu Veerraju: ఏపీలో బుద్ధిలేని నాయకత్వ పాలన..! మోడీ దగ్గర చెల్లవు..

ఒంగోలు స్టేడియంలో మహానాడు నిర్వహణకు అనుమతివ్వలేదని మండిపడ్డ అచ్చెన్నాయుడు… బోడి జగన్ అనుమతిచ్చేదేంటీ..? మేం మహానాడు కోలమ స్థలం ఇస్తామని రైతులు ముందుకొచ్చారని తెలిపారు.. ఇప్పుడు ఆ మహానాడు ప్రాంగణానికి వాహనాలు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలు ఇవ్వకుండా ఆర్టీఏ అధికారులు.. ఆర్టీసీ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. బస్సులు ఇవ్వకుండా ఆర్టీసీ ఎండీ తమ కిందిస్థాయి సిబ్బందికి అడ్డుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గత ప్రభుత్వంలో పని చేయలేదా..? అని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు.. ఖబడ్దార్ అధికారులారా..? మీ సంగతి తేలుస్తాం..! అని హెచ్చరించారు. ప్రభుత్వం వాహనాలు ఇవ్వకుండా అడ్డుకుంటే చీమల దండులా కదులుతాం.. మోటార్ బైకులు, ట్రాక్టర్లు, సొంత వాహనాల మీద మహానాడుకు తరలివెళ్తాం.. అవసరమైతే నడిచి వస్తాం అని ప్రకటించారు. అధికారులా..? జగన్ వద్ద పాలేరులా..? అంటూ విరుచుకుపడ్డ అచ్చెన్నాయుడు.. జగన్ సభలకు సామాన్యులకు బస్సులన్నీ ఆపేసి జనాన్ని పంపుతున్నారు కదా..? అని నిలదీశారు.

Exit mobile version